భక్తిశ్రద్ధలతో.. గోపూజ

ABN , First Publish Date - 2021-01-16T05:32:44+05:30 IST

నరసరావు పేటలోని క్రీడా ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన గోపూజ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగిం ది.

భక్తిశ్రద్ధలతో.. గోపూజ
గంగిరెద్దు ఆటను తిలకిస్తున్న సీఎం జగన్‌

హాజరైన సీఎం జగన్‌

ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు


నరసరావుపేట, జనవరి 15 : నరసరావు పేటలోని క్రీడా ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన గోపూజ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగిం ది. గోపూజలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో  హెలీప్యాడ్‌ వద్ద జగన్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధి కారులు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఆయన వేదికకు చేరు కున్నారు. మార్గ మధ్యలో వైసీపీ శ్రేణులు ఆయన పై పూలవర్షం కురిపించారు. వేదిక వద్ద ఏర్పాటుచేసిన జగనన్న నమూనా ఇల్లు, నవ రత్నాల పఽథకాల స్టాల్స్‌ను, గంగిరెద్దు నృత్యా న్ని ఆయన తిలకించారు. రంగవల్లులు, హరి దాసుల కీర్తనలు, కోలాటాలు, గోవింద నామస్మరణతో గోపూజ ప్రాంగణం మా ర్మోగింది. గోపూజ విశిష్టతను ఇస్కాన్‌ దేవాలయ కార్య నిర్వాహకుడు వైష్ణవ కృష్ణదాస్‌ తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలతో సీఎం జగన్‌ ప్రసంగాన్ని ముగించారు. నరసరావుపేట అభివృద్ధి కోసం పలువురు వినతిపత్రాలను జగన్‌కు అందజేశారు. నరసరావు పేటను జిల్లాకేంద్రంగా ప్రకటిం చాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. జగన్‌ను సత్కరించి, జ్ఞాపికను అంద జేశారు. గోపూజ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, జిల్లా ఇన్‌ ఛార్జ్‌ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, మేకతోటి సుచరిత, ఎంపీలు లావు శ్రీ కృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే లు కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, అంబటి రాంబాబు, విడదల రజని, డాక్టర్‌ ఉండ వల్లి శ్రీదేవి, పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి, మేరుగ నాగార్జున, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, షేక్‌ ముస్తాఫా, అన్నాబత్తుని శివకుమార్‌, నం బూరు శంకరరావు, కిలారు రోశ య్య, కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌, జేసీ దినేష్‌కుమార్‌, సబ్‌కలెక్టర్‌ శ్రీవాస్‌నుపూర్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, జేఈవోలు బసంత్‌ కమార్‌, ధర్మారెడ్డి, అర్చకులు శేషాద్రి పాల్గొన్నారు. గోపూజకు ఇస్కాన్‌ సంస్థ సహకారాన్ని అం దించింది. ఎస్పీ విశాల్‌గున్నీ బందో బస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.  

Updated Date - 2021-01-16T05:32:44+05:30 IST