గో వధ జరగడం బాధాకరం: ముస్లిం మత పెద్దలు

ABN , First Publish Date - 2021-02-27T21:58:21+05:30 IST

పట్టణ కేంద్రంలో గోవధ జరగడం బాధాకరమని పట్టణానికి చెందిన పట్టణానికి

గో వధ జరగడం బాధాకరం: ముస్లిం మత పెద్దలు

సిద్దిపేట: పట్టణ కేంద్రంలో గోవధ జరగడం బాధాకరమని పట్టణానికి చెందిన ముస్లింమత పెద్దలు విచారం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ముస్లిం మత పెద్దలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు  మాట్లాడుతూ శుక్రవారం పట్టణ కేంద్రంలో గోవధ జరిగిన సంఘటనపై తాము విచారం వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. పట్టణంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని వారు పేర్కొన్నారు. హైదరాబాదులోని మరికొందరితో చేతులు కలిపి కొంతమంది స్వార్థపూరిత వ్యక్తులు ఇలాంటి గో వధ వ్యాపారాలకు పాల్పడుతున్నారని మత పెద్దలు  ఆరోపించారు. నిన్న జరిగిన సంఘటనకు సిద్దిపేటలోని ముస్లిం సంఘాలకు ఎలాంటి సంబంధం లేదని ముస్లిం మత పెద్దలు తెలిపారు. 


నిన్న సిద్దిపేటలో గోవుల వధ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పుల్లూరు రోడ్డులోని కోళ్లఫారం షెడ్డులో కబేళా నిర్వాహకులు 18 గోవులను వధించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ముస్తాబాద్‌ చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి.. అనంతరం అక్కడ ధర్నా చేశారు. గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర విచా రం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, గోవులను తరలించిన వాహనాలను సీజ్‌ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఘటనాస్థలిలో మిగిలిన గోవులను సిద్దిపేటలోని గోశాలకు తరలించాలని అధికారులకు సూచించారు. 

Updated Date - 2021-02-27T21:58:21+05:30 IST