Go First Flight: విండ్‌షీల్డ్‌లో పగుళ్లతో దారి మళ్లింపు

ABN , First Publish Date - 2022-07-21T00:37:29+05:30 IST

గో ఫస్ట్ విమానంలో మరోసారి సాంకేతిక లోపాలు తలెత్తాయి. బుధవారంనాడు ఢిల్లీ నుంచి గౌహతి వెళ్తుండగా మార్గమధ్యలో ...

Go First Flight: విండ్‌షీల్డ్‌లో పగుళ్లతో దారి మళ్లింపు

జైపూర్: గో ఫస్ట్ (Go First) విమానంలో మరోసారి సాంకేతిక లోపాలు తలెత్తాయి. బుధవారంనాడు ఢిల్లీ నుంచి గౌహతి వెళ్తుండగా మార్గమధ్యలో విండ్‌షీల్డ్‌లో పగుళ్లు (Windshield cracks) కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు. గో ఫస్ట్ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడం గత రెండు రోజుల్లో ఇది మూడోసారి.


కాగా, ఇంజన్లలో సాంకేతిక సమస్యల కారణంగా మంగళవారం కూడా రెండు గో ఫస్ట్ విమానాలు నిలిచిపోయాయి. G8-386 ముంబై-లేహ్ విమానాన్ని ఢిల్లీకి, G8-6202 శ్రీనగర్-ఢిల్లీ విమానాన్ని శ్రీనగర్‌కు దారి మళ్లించారు. వివిధ కారణాలతో విమానాల దారి మళ్లింపు, అత్యవసర ల్యాండింగ్ వంటి ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతుండటంతో డీజీసీఏ స్పాట్ చెక్స్ చేపడుతోంది. విమానాలు బయలుదేరడానికి ముందు వాటిని తనిఖీ చేసి సర్టిఫై ఇవ్వాల్సిన ఇంజనీర్లు చాలినంతగా లేకపోవడం ఇందుకు ఒక కారణంగా డీజీసీఏ గుర్తించింది.

Updated Date - 2022-07-21T00:37:29+05:30 IST