ఎన్ని అడ్డంకులున్నా పేదలకు ఇళ్ల పట్టాలిస్తాం

ABN , First Publish Date - 2020-11-01T10:17:29+05:30 IST

అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ళ పట్టాలివ్వాలని ప్రభుత్వం చూస్తుంటే ప్రతిపక్షం కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటోందని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు.

ఎన్ని అడ్డంకులున్నా పేదలకు ఇళ్ల పట్టాలిస్తాం

 జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీరంగనాథరాజు 


సత్తెనపల్లిరూరల్‌, అక్టోబరు 31: అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ళ పట్టాలివ్వాలని ప్రభుత్వం చూస్తుంటే ప్రతిపక్షం కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటోందని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మండలంలోని ధూళిపాళ్ళలో శనివారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమిపూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రతిఒక్కరికీ పూర్తి హక్కుతో కూడిన ఇంటిపట్టా ఇస్తామని మంత్రి చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతులకు మెరుగైన సేవలు లభిస్తున్నాయన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌, మారెట్‌యార్డు చైర్మన్‌ రాయపాటి పురుషోత్తమరావు, నిమ్మకాయల రాజనారాయణ, కళ్ళం విజయభాస్కరరెడ్డి, షేక్‌ నాగుల్‌మీరాన్‌, కట్టా సాంబయ్య, అచ్యుత శివప్రసాద్‌, ఆతుకూరి నాగేశ్వరరావు, చల్లంచర్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-01T10:17:29+05:30 IST