ఎరువుల పంపిణీకి ప్రత్యేక యాప్‌

ABN , First Publish Date - 2020-10-01T10:04:09+05:30 IST

జాతీయస్థాయిలో ఎరువుల పంపిణీకి కేంద్రం ప్రభుత్వం ఒక ప్రత్యేకయాప్‌ను తయారు చేసింది. దీనిని బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి సదానందగౌడ్‌

ఎరువుల పంపిణీకి ప్రత్యేక యాప్‌

గుంటూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో ఎరువుల పంపిణీకి కేంద్రం ప్రభుత్వం ఒక ప్రత్యేకయాప్‌ను తయారు చేసింది. దీనిని బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి సదానందగౌడ్‌, తాడేపల్లినుంచి సీఎం జగన్మోహనరెడ్డిలు వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నంబూరులోని రైతుభరోసా కేంద్రంలో జేడీఏ విజయభారతి, కమిషనర్‌ కార్యాలయం జేడీ కృపాదాసు, ఏపీ ఆగ్రోస్‌ జేడీ  హరిబాబుచౌదరి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లాల్లోని రైతు భరోసా కేంద్రాల ప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారులతో జేడీలు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌-19ను దృష్టిలో ఉంచుకుని ఈ పాస్‌ మిషన్‌లో వేలుముద్రలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల సిబ్బంది రైతుల వివరాలన ప్రత్యేక యాప్‌లో నమోదుచేయాలన్నారు. 

Updated Date - 2020-10-01T10:04:09+05:30 IST