జీఎంఆర్‌ నష్టంరూ.1,127 కోట్లు

ABN , First Publish Date - 2020-07-31T07:39:38+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఏకీకృతప్రాతిదికన జీఎంఆర్‌

జీఎంఆర్‌ నష్టంరూ.1,127 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఏకీకృతప్రాతిదికన  జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.1,127 కోట్ల నష్టాన్ని చవి చూసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.2,353 కోట్లతో పోలిస్తే తగ్గింది. మొత్తం ఏడాదికి రూ.2,198 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. త్రైమాసిక   నికర ఆదాయం రూ.1,541 కోట్ల నుంచి రూ.1,813 కోట్లకు పెరిగింది. 2019-20కి నికరాదాయం రూ.6,518 కోట్లుగా నమోదైంది. ఎయిర్‌ పోర్టుల వ్యాపారంలో 2020, మార్చితో ముగిసిన మూడు నెలలకు విమాన ప్రయాణికుల రద్దీ 7 శాతం తగ్గి 1.56 కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. సమీక్ష త్రైమాసికంలో హైదరాబాద్‌ విమానాశ్రయంలో రద్దీ 12 శాతం క్షీణించి 48 లక్షల మందికి చేరింది. 

Updated Date - 2020-07-31T07:39:38+05:30 IST