కోనసీమ అభివృద్ధికి కృషి చేస్తా

ABN , First Publish Date - 2020-10-02T09:21:01+05:30 IST

నాన్న ఆశయ సాధనలో భాగంగా కోనసీమ అభివృద్ధికి కృషి చేస్తానని లోక్‌సభ దివంగత స్పీకర్‌ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌మాధుర్‌ అన్నారు.

కోనసీమ అభివృద్ధికి కృషి చేస్తా

బాలయోగి తనయుడు హరీష్‌మాధుర్‌


 ఐ.పోలవరం, అక్టోబరు 1: నాన్న ఆశయ సాధనలో భాగంగా కోనసీమ అభివృద్ధికి కృషి చేస్తానని లోక్‌సభ దివంగత స్పీకర్‌ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌మాధుర్‌ అన్నారు. బాలయోగి జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం రామాలయంపేట, పాత ఇంజరం వద్ద ఉన్న బాలయోగి విగ్రహాలకు హరీష్‌మాధుర్‌, మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పూలమాలలువేసి నివాళులర్పించారు. కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి మరువలేనిదని బుచ్చిబాబు కొనియాడారు. మురమళ్ల మార్కెట్‌ సెంటర్‌లో ఉన్న బాలయోగి విగ్రహానికి  బుచ్చిబాబు, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాత ఇంజరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు. 





తాళ్లరేవు: బాలయోగి జయింతి  టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తాళ్లరేవు అంబేడ్కర్‌ భవనంలో, నీలపల్లిలో  బాలయోగి విగ్రహాలకు టీడీపీ నాయకులు పూలమాలలువేసి  నివాళులర్పించారు. నాయకులు దున్నా సత్యనారాయణ, వస్కారెడ్డి, గంటా గోపి  పాల్గొన్నారు. 


కొత్తపేట: జీఎంసీ బాలయోగి అభివృద్ధి ప్రధాత అని కొత్తపేట టీడీపీ నేతలు పేర్కొన్నారు. గురువారం స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్‌లో బాలయోగి విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల రామకృష్ణ, ముత్యాల బాబ్జీ, కంఠంశెట్టి శ్రీనివాసరావు, గుబ్బల మూర్తి, పల్లికొండ సుధీర్‌, మిద్దే ఆదినారాయణ, అద్దంకి చంటిబాబు, బొరుసు సత్తిబాబు, నిమ్మకాయల చిన్నయ్య పాల్గొన్నారు.


ఆత్రేయపురం: జీఎంసీ బాలయోగి జయంతి ఘనంగా నిర్వహించారు. గురువారం ఆత్రేయపురంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు ఆధ్వ ర్యంలో బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు గ్రామాల్లో ముళ్లపూడి భాస్కరరావు, కరుటూరి నరసింహారావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాలింగి రవిచంద్ర, ముదునూరి సుబ్బరాజు, గార్లపాటి గోపి, మద్దింశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  


యానాం: జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలు గురువారం యానాంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం వద్ద గల బాలయోగి కాంస్య విగ్రహానికి పరిపాలనాధికారి శివరాజ్‌మీనా, మున్సిపల్‌ కమిషనర్‌ జి.గౌరీసరోజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  216 జాతీయ రహదారి టోల్‌గేట్‌ వద్ద గల బాలయోగి విగ్రహానికి పూలమాలలో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలయోగి చేసిన సేవలను విద్యార్థులు కొనియాడారు. కార్యక్రమంలో సీఐ గూటం శివగణేష్‌, ప్రాంతీయ విద్యాశాఖఽధికారి కాలే సాయినాథ్‌, నాయకులు మట్టపర్తి సుబ్బారావు, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అఽధ్యక్షుడు మల్లాడి శామ్యూల్‌, సమాచార శాఖాధికారి కాళ్ల సత్యనారాయణ తదితరులు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 


అమలాపురం రూరల్‌: బాలయోగి జయంతి పురస్క రించుకుని బండారులంక టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వ ర్యంలో బాలయోగి విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు.  మాజీ జడ్పీటీసీ చింతా శంకరమూర్తి, మాజీ ఎంపీపీ ఊటు కూరి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, మాజీ ఎంపీటీసీ మాడా మాధవి, నాయకులు గుమ్మిడి సత్తిబాబు, కొండా రాజు, బళ్ల శ్రీనివాసచక్రవర్తి, బండి సుబ్బారావు పాల్గొన్నారు. 


ఉప్పలగుప్తం: లోక్‌సభ మాజీ స్పీకర్‌ దివంగత జీఎంసీ బాలయోగి జయంతి టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉప్పలగుప్తం బాలయోగి పార్కులో బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ జడ్పీటీసీ  దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, పెయ్యల దుర్గారావు, అరిగెల నానాజీ, రవణం మధు, గాలిదేవర సురేష్‌కుమార్‌, మధుర ప్రతాప్‌, సలాది శ్రీనివాసరావు, రాయి పోలరాజు. వంగలపూడి నరసింహమూర్తి, కుంచే రాజేష్‌, గెడ్డం మోహన్‌,  పరమట లోవరాజు, మాకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


ముమ్మిడివరం: బాలయోగి కోనసీమ అభివృద్ధి ప్రధాత అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ముమ్మిడివరం టీడీపీ కార్యాలయంలో బాలయోగి జయంతి వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌చేసి పంచారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలోని జీఎంసీ బాలయోగి విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  మాజీ చైర్‌పర్సన్‌ చెల్లి శాంతకుమారి, నాయకులు చెల్లి అశోక్‌, అర్దాని శ్రీనివాసరావు, తాడి నరసింహారావు, దాట్ల బాబు, గొల్లపల్లి గోపి, చిక్కాల అంజిబాబు, దొమ్మేటి రమణకుమార్‌, విళ్ల వీరాస్వామినాయుడు, మట్ట సత్తిబాబు, సత్తి నూకరాజు, బొక్కా రుక్మిణి, వాసంశెట్టి అమ్మాజీ, యాళ్ల ఉదయ్‌, మెండి కమల, జగతా గోవిందరావు, అన్నాబత్తుల లక్ష్మి, కొప్పిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు, నడింపల్లి శ్రీనివాసరాజు, కాశి మూర్తి, చింతపల్లి రాజు పాల్గొన్నారు.


కాట్రేనికోన: కాట్రేనికోన గేట్‌ సెంటర్‌లో లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి జయంతిని టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విత్తనాల బుజ్జి, ఈదరపల్లి నరసింహరాజు, విత్తనాల వెంకటరమణ, గుత్తుల సూరిబాబు, మోకా లోవరాజు, రేవు రమేష్‌, ఓలేటి విష్ణు, కోటిపల్లి సత్యనారాయణ, కాశి నానిబాబు, కర్రి శ్రీనివాస్‌, కొప్పాడ అబ్బులు, దిగుమర్తి ఏసుబాబు పాల్గొన్నారు.


అయినవిల్లి: జీఎంసీ.బాలయోగి సేవలు చిరస్మరణీ యమని మాజీ ఎంపీపీ సలాది పుల్లయ్యనాయుడు అన్నారు. ముక్తేశ్వరంలోని బాలయోగి శిలా విగ్రహానికి పలువురు పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పిం చారు. కార్యక్రమంలో నేదునూరి వీర్రాజు, సరెళ్ల వెంకట సత్యనారాయణ, దంగేటి వెంకటరమణ, తోట సుబ్బా రావు, కుంచే చంద్రకాంతుడు పాల్గొన్నారు. 


అంబాజీపేట: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బాలయోగి విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి  నివాళులర్పించారు. పుల్లేటికుర్రులో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో బాలయోగి విగ్రహానికి పలువురు పూలమాలలలు వేసి నివాళులర్పించారు. పుల్లేటికుర్రులో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌ యువసేన అధ్యక్షుడు వక్కలంక బుల్లియ్య ఆధ్వర్యంలో సమకూర్చినదుస్తులను నాయకులు పేదలకు అందించారు. టీడీపీ మండల అధ్య క్షుడు దంతులూరి   శ్రీనురాజు,  కార్యదర్శి గుడాల ఫణి,  మాజీ ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, నాయకులు అరిగెల బలరామమూర్తి, నాగబత్తుల సుబ్బారావు, పబ్బినీడి రాంబాబు, డి.సురేష్‌ పాల్గొన్నారు. 


మామిడికుదురు: కోనసీమ అభివృద్ధి ప్రధాతగా లోక్‌సభ దివంగత స్పీకర్‌ జీఎంసీ.బాలయోగి నిలుస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు అన్నారు. బాలయోగి జయంతిని మగటపల్లి, పాశర్లపూడి, అప్పన పల్లి గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మగటపల్లిలో బాలయోగి చిత్రటానికి ఆయన పూలమాలలు వేసి నివా ళులర్పించారు. పాశర్లపూడిలో పలువురు టీడీపీ నాయ కులు బాలయోగి విగ్రహాలకు పూలమాలలువేసి నివాళు లర్పించారు. కార్యక్రమాల్లో అల్లూరి గోపీరాజు, చుట్టుగుళ్ల కిషోర్‌, బోనం బాబు, కొల్లి ఏడుకొండ పాల్గొన్నారు. 


పి.గన్నవరం: కోనసీమ అభివృద్ధికి కృషిచేసిన మహోన్నత వ్యక్తి బాలయోగి అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు అన్నారు. లంకలగన్నవరంలో బాలయోగి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. పి.గన్నవరం అక్విడెక్టు వద్ద  టీడీపీ మండల అధ్యక్షుడు పడాల సూపర్‌ ఆధ్వర్యంలో బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పెచ్చెట్టి పెద్ద, కుసుమ ప్రసాద్‌, సిఖిలే డెవిడ్‌ పాల్గొన్నారు.  పి.గన్నవరం అక్విడెక్టు వద్ద బాలయోగి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  


రాజోలు: రాజోలు కాటన్‌ పార్కులో బాలయోగి జయంతి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వ ర్యంలో నిర్వహించారు. తాటిపాకలో  బాలయోగి చిత్ర పటానికి గొల్లపల్లి  పూలమాలలువేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో బోనం నాగేశ్వరరావు, మామిడికు దురు మండల పార్టీ అధ్యక్షుడు సూదా బాబ్జి, రాజోలు మండల ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, పిల్లి శ్రీరామ మూర్తి, కసుకుర్తి త్రినాథస్వామి, బోళ్ల వెంకటరమణ, పొలమూరి శ్యాంబాబు, రేవు జీవరత్నం పాల్గొన్నారు. 


మలికిపురం: మలికిపురంలో బాలయోగి విగ్రహానికి పలువురు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ కాకి లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రజల మదిలో బాలయోగి చిరస్మరణీయుడన్నారు. అడబాల యుగంధర్‌, సీహెచ్‌.నాగేశ్వరరావు,పిండి సత్యనారాయణ పాల్గొన్నారు. అంతర్వేదిపాలెంలో బాలయోగి జయంతి నిర్వహించారు. బాలయోగి విగ్రహానికి  టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పర్తి నాని పూలమాలలువేసి నివాళుల ర్పించారు. తాడి సత్యనారాయణ, జిల్లెళ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


రావులపాలెంరూరల్‌:  జీఎంసీ బాలయోగి జయంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రావులపాలెం టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామారావు, గ్రామ అధ్యక్షుడు పడాల బులికొండారెడ్డి, మేడపాటి కాసురెడ్డి, పోతుమూడి సత్యనారాయణ తదితరులు బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2020-10-02T09:21:01+05:30 IST