5 Vegetable peels for a glowing skin: కూరగాయల పీల్స్ తో మెరిసే చర్మం.. ఇంట్లో దొరికే కూరగాయలతో చర్మానికి కాంతి.

ABN , First Publish Date - 2022-08-29T21:51:36+05:30 IST

మన చర్మం సున్నితంగా ఉంటుంది దీనికి తగినంత శ్రద్ధ చాలా అవసరం.

5 Vegetable peels for a glowing skin: కూరగాయల పీల్స్ తో మెరిసే చర్మం.. ఇంట్లో దొరికే కూరగాయలతో చర్మానికి కాంతి.

బిజీ లైఫ్ స్టైల్ తో రోజంతా గందరగోళంగా గడిపే మనకు ఆరోగ్యం మీద చర్మం మీద శ్రద్ధ తీసుకోవడం తక్కువైపోతుంది. మన చర్మం సున్నితంగా ఉంటుంది కనుక దీనికి తగినంత శ్రద్ధ చాలా అవసరం. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ప్రకాశవంతంగా ఉంచేందుకు సహాయపడే మనకు అందుబాటులో ఉండే ఐదు కూరగాయల గురించి తెలుసుకుందాం. 


క్యారెట్.. క్యారెట్ తో జిడ్డు చర్మ సమస్యలు తగ్గుతాయి: క్యారెట్ (Carrot), క్యాబేజీ (Cabbage), టమోటో (Tomato) తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మర్దన చేసుకుని అరగంట తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే జిడ్డు చర్మ సమస్యలు తగ్గుతాయి. అందంగా కనిపిస్తారు. 


కుకుంబర్.. కీర దోసతో ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. చర్మాన్ని కాంతి వంతంగా మారుస్తుంది. కీరదోసలో విటమిన్ ఎ ఉంటుంది. బీటా కెరోటిన్ పుష్కలంగా దోసకాయలో దొరుకుతుంది. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.


గుమ్మడికాయ.. గుమ్మడికాయను ఎండాకాలంలో వాడటం వల్ల చల్లదనాన్ని ఇస్తుంది. సలాడ్ రూపంలో తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుమ్మడికాయలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్ళ చర్మాన్ని నిగారింపుగా మారుస్తుంది. 


ముల్లంగి.. ముల్లంగి లో ఉండే పోషకాలు చర్మానికి కాంతిని తెస్తాయి. ఇందులోని మినరల్స్, మిటమిన్స్ మన చర్మానికి తగినంత పోషణను అందివ్వడంలో సహాయపడతాయి. 


సొరకాయ.. సొరకాయ ఆరోగ్యానికి మంచిది. సొరకాయను జ్యూస్ చేసుకుని తీసుకోవచ్చు. ఇందులోని కాల్షియం, పాస్పరస్, విటమిన్-సి, బి. కాంప్లెక్స్ చర్మానికి నిగారింపుతోపాటు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. 

Updated Date - 2022-08-29T21:51:36+05:30 IST