వైభవం..వజ్రోత్సవం

ABN , First Publish Date - 2022-08-14T06:38:37+05:30 IST

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో శని వారం నిర్వహించిన తిరంగా ర్యాలీ ప్రజల్లో దేశభక్తిని నింపింది.

వైభవం..వజ్రోత్సవం

ఘనంగా.... తిరంగా ర్యాలీలు 

మహిళలు, అంగన్‌వాడీ టీచర్ల కోలాటాల ప్రదర్శన 

ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణలు

లంబాడీ నృత్యాలు, ఒగ్గుడోలు, డప్పు కళాకారుల ప్రదర్శనలు

వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే, జడ్పీ, బల్దియా చైర్‌ పర్సన్లు, అదనపు కలెక్టర్లు 

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 13 : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో శని వారం నిర్వహించిన తిరంగా ర్యాలీ ప్రజల్లో దేశభక్తిని నింపింది. పట్టణం లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రభాత బేరీలు, అం గన్‌ వాడీలు మహిళా సంఘాల సభ్యులు కోలాటాల ప్రదర్శనలు, పోలీస్‌ సి బ్బంది బైక్‌ విన్యాసాలు, లంబాడీల గిరిజన నృత్య ప్రదర్శనలు, ఒగ్గుడోలు, డప్పు కళాకారులతో నిర్వహించి తిరంగా ర్యాలీ జిల్లా కేంద్రాన్ని మూడు రంగుల మయం చేసింది, టవర్‌ నుంచి నిర్వహించిన తిరంగా ర్యాలీని  క లెక్టర్‌ రవి, ఎస్పీ సింధు శర్మ, జడ్పీ, బల్దియా అధ్యక్షురాల్లు దావ వసంత, బోగ వ్రావణి, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, అరుణశ్రీలతో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. భారీ జాతీయ ప తాకంతో విద్యార్థులు టవర్‌ నుంచితహసీల్‌ చౌరస్తా, పాత బస్టాండ్‌ సర్కి ల్‌ మీదుగా వివేకానంద స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. విద్యార్థులు వివిధ దేశ నాయకుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. అనం తరం వివేకానంద మినీ స్టేడియంలో పలు ప్రదర్శనలు నిర్వహించారు. మూడు రంగుల బెలూన్లను గాలిలో వదలగా ఆకాశం త్రివర్ణ శోభితంగా మారింది. అనంతరం కలెక్టర్‌ రవి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ అధ్య క్షురాలు దావ వసంతలు మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని తమ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, కౌన్సిలర్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొడ్ల జగ దీష్‌, జిల్లా అధ్యక్షుడు పంబాల రాం కుమార్‌, కమిషనర్‌ స్వరూప రాణితో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు. అలాగే అజాదికా అమృత్‌ మ హోత్సవ్‌లో భాగంగా జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయ మూర్తి నీలిమ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదు లు జాతీయ జెండాలు చేతపట్టుకుని తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆరు పదులు దాటి న వయసులోఉన్న రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం సభ్యులు పట్ట ణంలో ప్రధాన వీధుల గుండా నిర్వహించిన తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది.

ధర్మపురిలో.. ఆలయ ఉద్యోగులు

ధర్మపురి: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ధర్మపురి పట్టణంలో శనివారం ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు జాతీయ పతాకాలు చే తపట్టుకుని అన్ని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తిని చాటి చె ప్పడానికి, సమైక్యతను చాటుతూ బెలూన్లు ఎగుర వేశారు. పలువురు ప్ర జా ప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కీర్తించడం కోసం ఈ ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించినట్లుతెలిపారు.  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పక్షాన వేదపండితులు, అర్చకులు, రి నోవేషన్‌ కమిటీ సభ్యులు, సిబ్బంది, ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో కబడ్డీ, ఖోఖో పోటీలు ప్రారంభించారు. జాతీయ పతాకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిప ల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ అరుణ, ఏఎంసీ చైర్మన్‌ రాజేష్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, సీఐ కోటేశ్వర్‌, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌ వెంకటేష్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎంపీవో న రేష్‌కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రామయ్య, ఆలయ సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.   

మెట్‌పల్లి పట్టణంలో..

మెట్‌పల్లి : పట్టణంలో అజాదీకా అమృత్‌ మహోత్సవం హర్‌ ఘర్‌ తీ రంగా అభియన్‌లో భాగంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్‌, పట్టణ అధ్యక్షులు ఆర్మూర్‌ రంజీత్‌ ఆధ్వర్యంలో బీజేవైఎం, బీజేపీ నాయకులు జాతీయ జెండాలతో పట్టణంలోని పుర వీధుల గుండా జాతీ య రహదారిపై భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు జాతీయ జెండాలను ఇంటిపై ఎగురవేయాలని కోరారు. దేశానికి స్వతం త్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయైున సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్స వాలు నిర్వహిస్తున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్య క్షులు రమేష్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్‌, నాయకులు అరుణ, శ్రీనివాస్‌, నరేష్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

రాయికల్‌లో..

రాయికల్‌: రాయికల్‌ మండంలోని అన్ని గ్రామాలతో పాటు మున్సిపల్‌ లో శనివారం వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిఽధుల ఆధ్వర్యంలో భా రత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని ఘ నంగా నిర్వహించారు. రాయికల్‌ మున్సిపాలిటిలీ మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని వీధుల గుండా విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలు చేతిలో పట్టుకుని ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్ర మంలో వైస్‌ చైర్మన్‌ రమాదేవితో పాటు అన్నిశాఖల అధికారులు, నాయ కులు ఉన్నారు.

కోరుట్ల పట్టణంలో.. 

కోరుట్ల: పట్టణంలో స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాలను శనివారం ప ట్టణ ప్రజలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రతి ఇంటిపై జాతీ య జెండాలను ఎగరవేసి వేడుకలను నిర్వహించారు. పట్టణంలో ఫ్రీడం ర న్‌ నిర్వహించగా యవకులు, నాయకులు, విద్యార్థులు, మహిళలు జాతీ య జెండాలను చేత బూని ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని అంబే డ్క ర్‌ చౌరస్తా నుంచి కాలేజీ గౌండ్‌ వరకు ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ అం బేడ్కర్‌, కార్గిల్‌, నంది చౌరస్తా మీదిగా ఐబి రోడ్డు నుంచికాలేజీ గౌండ్‌ వరకు సాగింది. ర్యాలీలో జాతీయ జెండాలతో ఆ ప్రాంతాలు జాతీయ వా దం చాటింది. ర్యాలీని మున్సిపల్‌ చైర్మన్‌ అన్నం లావణ్య - అనిల్‌లు ప్రా రంభించారు. పట్టణానికి చెందిన మైనార్టీలతో పాటు పట్టణ ప్రజలు భారీ గా ర్యాలీలో పాల్గోన్నారు. 

ఫపట్టణం బీజేవైఎం ఆద్వర్యంలో అజాది అమృత మహోత్సవ కార్యక్ర మంలో బాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణం లోని పలు వార్డులలో జాతీయ జెండాలతో ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇంచార్జు డా. జేఏన్‌ వెంకట్‌లతో పాటు బీజేపీ, బీజేవైఎం నాయకలు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T06:38:37+05:30 IST