వైభవంగా చెన్నకేశవ స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

మండలంలోని వేపూరికోట సమీపంలో వెలసిన పురాతన ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని సోమవారం కన్నులపండవగా వైభవంగా నిర్వహించారు.

వైభవంగా చెన్నకేశవ స్వామి కల్యాణం
ములకలచెరువులో చెన్నకేశవ స్వామి కల్యాణం

ములకలచెరువు, మే 16: మండలంలోని వేపూరికోట సమీపంలో వెలసిన పురాతన ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని సోమవారం కన్నులపండవగా వైభవంగా నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిం చి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం వేద పండితుల మంత్రో చ్ఛారణలు, మేళతాళాల  మధ్య స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తు లు భారీ సంఖ్యలో హాజరయ్యారు.  బెంగళూరుకు చెందిన చక్రపాణి ఆచార్య అధ్వర్యంలో అభిషేకము, లోక కల్యాణం కోసం హోమం, ప్రత్యేక పూజలు అన్నదాన  నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక పెద్దలు పారే్‌షరెడ్డి, రెడ్డుప్పరెడ్డిలతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. కాగా బురకాయలకోట సమీపంలో వెలసిన ముత్యాలమ్మ అమ్మవారి తిరుణాల ఉత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా బురకాయలకోట, వేపూరికోట, మద్దినాయనిపల్లె గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. 


మదనపల్లెలో శ్రీనివాసుడి కల్యాణం

మదనపల్లె అర్బన్‌ మే 16 : పట్టణంలోని దేవళం వీధిలో ఉన్న ప్రస న్న వెంకటరమణస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భా గంగా సోమవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కల్యాణం వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. అంతకు ముందు ఉదయం ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కల్యాణం తిలకించారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాల తో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రమణ, ఆలయ కమిటీ సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 

అశ్వ వాహనంపై ఏనుగు మల్లమ్మ దేవత

బి.కొత్తకోట మే 16 : ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో గల ఏనుగు మల్లమ్మ దేవత జాతర ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మ వారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఏనుగు మల్లమ్మ ఆలయంలో మూడురోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఆలయంలో అమ్మవారికి అభిషేక విశేష పూజలు నిర్వహించారు. రాత్రి మంగళ వాయిద్యాలు, కోలాటల మధ్య అశ్వవాహనంపై అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానికులు,పర్యాటకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మ వారి జాతర ఉత్సవాలు మంగళవారం వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

 ఘనంగా కామాక్షి అమ్మవారి జాతర 

బి.కొత్తకోట నగర పంచాయతీలోని జనుపవీధిలో వెలసిన గంగా కామాక్షి అమ్మ వార్ల గంగ జాతర ఉత్సవాలు సాదెచెట్టి సంఘం ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  మంగళవారం రాత్రి గెరిగి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని సాదెచెట్టి సంఘం వారు తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. 

వాల్మీకిపురంలో  అమ్మవారి నగరోత్సవం 


వాల్మీకిపురం, మే 16: వాల్మీకిపురం నల్లవీఽరగంగాభవాని అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా  అమ్మవారిని పుష్పపల్లకిపై విశేష అలంకరణలుగావించి పట్టణ పురవీధులలో నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అమ్మవారికి సారే అందజేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యువకుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిశాయి. కార్యక్రమంలో మానవతా సంస్థ జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఆలయ ధర్మకర్త రమణారెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్‌ రామ్‌కుమార్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ కేశవరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST