కృష్ణాష్టమి వైభవం

ABN , First Publish Date - 2022-08-20T04:57:34+05:30 IST

కృష్ణాష్టమి ప ర్వదినాన్ని శుక్రవారం జిల్లావ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. హిందూపురం చిన్నమార్కెట్‌ వేణుగోపాలస్వామి ఆ లయంలో రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ని సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు.

కృష్ణాష్టమి వైభవం
హిందూపురంలో బ్రహ్మరథోత్సవం

హిందూపురంఅర్బన/మడకశిరరూరల్‌/మడకశిర టౌన/చిలమత్తూరు/గోరంట్ల/రొళ్ల/గుడిబండ/ లేపాక్షి/ పెనుకొండ/పావగడ/అగళి, ఆగస్టు 19: కృష్ణాష్టమి ప ర్వదినాన్ని శుక్రవారం జిల్లావ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. హిందూపురం చిన్నమార్కెట్‌ వేణుగోపాలస్వామి ఆ లయంలో రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ని సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. అనంతరం శ్రీ వారి కల్యాణోత్సవం నయనానందకరంగా సాగింది. ఉత్సవ విగ్రహాలను రథంలో అధిరోహించి పురవీధుల్లో ఊరేగించారు. చిన్నారుల శ్రీకృష్ణ, సత్యభామల వేషధారణలు ఆకట్టుకున్నాయి. పట్టణంలో పలు ప్రాంతాల్లో చిన్నారుల కో లాటం, ఉట్టికొట్టే వేడుకలు సంబరంగా చేశారు. మడకశిర మండలం ఛత్రం పంచాయతీ పరిఽధిలోని మహిళలు హారతులతో ఉరేగింపుగావచ్చి శ్రీకృష్ట ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. నీలకంఠాపురం దేవాలయాల్లో స్వామి వారి ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు మడకశిర ప ట్టణం  గాంధీబజార్ల్‌ కన్యకా పరమేశ్వరి ఆలయ మురళీ కృష్ణ, గణేష్‌ మంటపాల్లో  కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశా రు. ప్రబోధానందస్వామి శిష్యుబృందం ప్రవచనాలు చేశా రు. శ్రీకృష్ణదేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించా రు. చిలమత్తూరు వేణుగోపాలస్వామి ఆలయంలో యాద వ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించా రు. ఉత్సవ విగ్రహాన్ని ప్రధాన వీధుల గుండా ఊరేగించా రు. చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.


 గోరంట్ల మండలం కొండాపురం, మేరెడ్డిపల్లి వేణుగోపాలస్వామి ఆ లయాలు, మల్లాపల్లి శ్రీగోకులానంద ఆశ్రమంలో ప్రత్యేకపూజలు, భజనలు చేశారు. గోరంట సరస్వతి విద్యామందిరంలో యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జ రిపారు. పాత స్టేట్‌బ్యాంక్‌ వద్ద  ఇందు జ్ఞానవేదిక ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటుచే సి పూజలు చేశారు. రొళ్లలో జరిగిన వేడుకలకు శ్రీకైవల్యానందస్వామి హాజరయ్యారు. ఆర్‌ గొల్లహట్టిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుడిబండ మండలం బూదిపల్లి, కేడీపాళ్యం, జమ్మలబండ, గొల్లహట్టి గ్రామాల్లో  యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. మహిళలు హారతులు, కలశాలతో ఊరేగింపు చేపట్టారు.  లేపాక్షి  మండల వ్యాప్తంగా  వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నాయనపల్లి క్రాస్‌ షిర్డీసాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉట్టికొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెనుకొండలో విశ్వహిందూపరిషత, యాదవ సంఘం ఆ ధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. గొల్లపాళ్యంలోని కృష్ణస్వామి గుడి నుంచి ఉత్సవ విగ్రహాలను మే ళతాళాలతో బోగసముద్రం చెరువు వరకు ఊరేగించారు. గోపాలస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. పావగడ తహసీల్దార్‌ కార్యాలయం, హెల్ప్‌ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ చిత్రపటానికి పూజలు చేశారు. అగళి మండలం పూలపల్లిలో కృష్ణుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం చేశారు.

Updated Date - 2022-08-20T04:57:34+05:30 IST