ఘనంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-07-04T05:32:41+05:30 IST

ఇక్కడి వెంకటాద్రి ఆలయ శిఖర మార్గంలో వున్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

పెందుర్తి, జూలై 3: ఇక్కడి వెంకటాద్రి ఆలయ శిఖర మార్గంలో వున్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, అభిషేకాలు చేశారు. మూలవిరాట్‌ విగ్రహానికి నక్షత్ర హారతులిచ్చాక శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ ధర్మకర్త శరగడం చినఅప్పలనాయుడు దంపతులు కల్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అన్న సమారాధన చేపట్టారు.


Updated Date - 2022-07-04T05:32:41+05:30 IST