ఘనంగా ప్రపంచ వెదురు దినోత్సవం

ABN , First Publish Date - 2021-09-19T05:22:06+05:30 IST

ఘనంగా ప్రపంచ వెదురు దినోత్సవం

ఘనంగా ప్రపంచ వెదురు దినోత్సవం
జ్యోతి వెలిగిస్తున్న పిరియా విజయ

సోంపేట : ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం వైసీపీ సమన్వయకర్త పిరియా విజయ మాట్లాడుతూ... వెదురుకు ప్రపంచంలో ఎంతో గుర్తింపు ఉందన్నారు. ప్రతీవ్యక్తి నిత్యవసరాలవలే వెదురు వస్తువులు కూడా ఎంతో అవసరం అన్నారు. ఇలాంటివి తయారు చేసే కార్మికులను ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నగిరి ప్రభావతి, మాజీ జడ్పీటీసీ నిమ్మన దాసు, మేదర సంఘ అధ్యక్షుడు తెల్లి వైకుంఠరావు, ఉపాధ్యక్షుడు తెల్లి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2021-09-19T05:22:06+05:30 IST