ఘనంగా ఓటర్ల దినోత్సవం

ABN , First Publish Date - 2021-01-26T06:23:15+05:30 IST

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక యాప్‌ ద్వారా ఇ-ఎపిక్‌ కార్డు కోసం నమోదుకు అవకాశం కల్పించిందని నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య తెలిపారు.

ఘనంగా ఓటర్ల దినోత్సవం
నర్సీపట్నంలోని ర్యాలీలో సబ్‌ కలెక్టర్‌ మౌర్య, కమిషనర్‌ కనకారావు తదితరులు

నర్సీపట్నం, జనవరి25 : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా  ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక యాప్‌ ద్వారా ఇ-ఎపిక్‌ కార్డు కోసం నమోదుకు అవకాశం కల్పించిందని నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య తెలిపారు. పద్ధెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ యువకులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం  జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా  స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి అబీద్‌ సెంటర్‌ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్లమెంట్‌ ఎన్నికల వరకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు, తహసీల్దార్‌ జయ, ఎలక్షన్‌ డీటీ సూర్యనారాయణ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-26T06:23:15+05:30 IST