ఘనంగా వీరనాగమ్మ ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-05-17T05:57:22+05:30 IST

మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో పాలవేరు వీరనాగమ్మ ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి.

ఘనంగా వీరనాగమ్మ ఉత్సవాలు
జనసంద్రంగా మారిన ఆలయ ప్రాంగణం

అనంతపురం రూరల్‌, మే16: మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో పాలవేరు వీరనాగమ్మ ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. అమ్మవారి మూల విరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నాం టీఎం.చంద్రశేఖర్‌ అగ్నిగుండ ప్రవేశం, నిప్పుల మింగుట నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు. ఇందులో నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలానికి చెందిన రాంభూపాల్‌రెడ్డి ఎద్దులు మొదటి స్థానంలో నిలిచాయి. వీరికి గ్రామ సర్పంచు సావిత్రి శ్రీనివాసులు రూ.1.10లక్ష నగదు బహుమతి అందజేశారు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో పాణ్యం మండలం ఎస్‌.కొత్తూరుకు చెందిన బిఎ్‌సఎ్‌సరెడ్డి ఎద్దులు నిలిచాయి. వీరికి గంగులకుంట గ్రామానికి చెందిన చిట్రా వెంకటరాముడు రూ.80వేలు, గార్లదిన్నెకు చెందిన కె.నరేష్‌ ఎద్దులు తృతీయ స్థానంలో నిలవగా వీరికి ఆకుతోటపల్లి గ్రామ సర్పంచు గురుప్రసాద్‌, సత్యనారాయణరెడ్డి రూ.60వేలు నగదు బహుమతులను అందించారు.



Updated Date - 2022-05-17T05:57:22+05:30 IST