ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలు

ABN , First Publish Date - 2022-01-23T05:07:04+05:30 IST

మండలంలోని కొత ్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామంలో శనివారం గ్రామ పెద్దలతోపాటు గ్రామ నాయీబ్రాహ్మణుల ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి 4వ వార్షికోత్సవ , ఆరాధన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలు
గ్రామోత్సవంలో డప్పు వాయిద్యాల మధ్య త్యాగరాజస్వామి

ప్రొద్దుటూరు రూరల్‌, జనవరి 22: మండలంలోని కొత ్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామంలో శనివారం గ్రామ పెద్దలతోపాటు గ్రామ నాయీబ్రాహ్మణుల ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి 4వ వార్షికోత్సవ , ఆరాధన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.  ఉదయం త్యాగరాజస్వామి చిత్రపటాన్ని గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడి ్డ పాల్గొన్నారు.  సాయంత్రం మంగళవాయిద్యాలు, డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభగవంగా త్యాగరాజస్వామి గ్రామోత్సవం నిర్వహించారు.  సాయం త్రం వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొనిరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర ్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. 

 త్యాగరాజస్వామి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి.. కానపల్లె గ్రామంలో నాలుగేళ్లుగా త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అయితే త్యాగరాజస్వామి ఆలయ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలన్నారు. నాయీ బ్రాహ్మణులు అంతా కలిసి సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. గ్రామంలో త్యాగరాజస్వామి ఆలయ నిర్మాణానికి తన అన్న కొనిరెడి ్డ రామచంద్రారెడి ్డ జ్ఞాపకార్థం స్థలం ఉచితంగా ఇవ్వడంతోపాటు ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని శివచంద్రారెడ్డి నాయీ బ్రాహ్మణులకు హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-01-23T05:07:04+05:30 IST