ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

ABN , First Publish Date - 2021-09-18T06:35:02+05:30 IST

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంగళవారం గోదావరిఖని శివాజీనగర్‌లోని బీజేపీ ఉపకార్యాలయంలో మాజీ ఎమ్మె ల్యే సోమారపు సత్యనారాయణ జాతీ య జెండాను ఆవిష్కరించారు.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
‘ఖని’లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సోమారపు సత్యనారాయణ

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 17: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంగళవారం గోదావరిఖని శివాజీనగర్‌లోని బీజేపీ ఉపకార్యాలయంలో మాజీ ఎమ్మె ల్యే సోమారపు సత్యనారాయణ జాతీ య జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు గుండబోయి న లక్ష్మణ్‌యాదవ్‌, నాయకులు గాండ్ల ధర్మపురి, సోమారపు లావణ్య, సోమారపు అరుణ్‌, మాతంగి రేణుక, కుంభాల రాజు, తడగొండ నర్సయ్య,  మంచికట్ల బిక్షపతి, డేవిడ్‌ రా జ్‌ పాల్గొన్నారు. అలాగే గాంధీనగర్‌లోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశానికి సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కోడిపుంజుల రాజన్న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యూడెమోక్రసీ పెద్దపల్లి డివిజన్‌ కార్యదర్శి నరేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐ కృష్ణ, తోకల రమేష్‌, అబెద్నెగో, కాసిపేట ధర్మేందర్‌, మొగిలి సమ్మయ్య, వాసుదేవరెడ్డి, కొమురయ్య, మల్లే ష్‌, అన్వేష్‌, మధు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T06:35:02+05:30 IST