Abn logo
Sep 20 2021 @ 23:22PM

వైభవంగా ఏకాంతసేవ

ఏకాంత సేవలో శ్రీముఖలింగేశ్వరస్వామి

శ్రీముఖలింగం (జలుమూరు) సెప్టెంబరు 20: శ్రీముఖలింగేశ్వరాలయంలోని పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలకు సోమవారం రాత్రి అర్చకులు ఏకాంత సేవ నిర్వహించారు. భాద్రపద శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ మాడవీధుల్లో తిరువీధి నిర్వహించి రాత్రి ఊయల్లో వేసి జోలపాటలు పాటి ఏకాంత సేవ చేపట్టారు. అనంతరం అష్టాదశ హారతిని అందించారు.  ఈ కార్యక్రమాన్ని అర్చకులు పెద్దలింగన్న, నారాయణమూర్తి, సింహాచలం, శ్రీకృష్ణ, అప్పారావు, యోగి చేపట్టారు.