వైభవంగా సీతారాముల కల్యాణం

ABN , First Publish Date - 2021-04-22T05:25:13+05:30 IST

శ్రీరామనవమిని పురస్కరించుకుని బుధవారం జిల్లావ్యాప్తంగా సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

వైభవంగా సీతారాముల కల్యాణం

మహారాణిపేట, ఏప్రిల్‌ 21: శ్రీరామనవమిని పురస్కరించుకుని బుధవారం జిల్లావ్యాప్తంగా సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. మహారాణిపేటలోని అంబికాబాగ్‌లో స్వామివారి కల్యాణోత్సవాన్ని ఏకాంతసేవలో నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌ నియమ నిబంధనలను అనుసరించి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణ వేడుకలు కమనీయంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌.జె.మాధవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-22T05:25:13+05:30 IST