ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-06-20T05:18:26+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను శనివారం ఇక్కడ ఘనంగా నిర్వహిం చారు.

ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు
పాయకరావుపేటలో పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న జగతా శ్రీను



  సేవా కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్‌ శ్రేణులు

పాయకరావుపేట, జూన్‌ 19: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను శనివారం ఇక్కడ ఘనంగా నిర్వహిం చారు.  ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగతా శ్రీను తదితరులు పేదలకు భోజనం ప్యాకెట్లు, మాస్క్‌లు పంపిణీ చేశారు. నాయకులు కర్రి హేమంత్‌, పోలవరపు అప్పలరాజు, రమణ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కోటవురట్ల: రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను కోటవురట్ల మండలంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇక్కడి సీహెచ్‌సీలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. తహసీల్దార్‌ కార్యాలయం, మీ-సేవకేంద్రం వద్ద స్వీట్లు, మాస్కులు పంపిణీ చేశారు.  జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు యంగధర్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సూర్యకుమారి, మండల పార్టీ అధ్యక్షుడు నడింపల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:18:26+05:30 IST