Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైభవంగా పోలిపాడ్యమి

గాజువాక, డిసెంబరు 5: కార్తీక మాసం ముగిసిన సందర్భంగా పోలిపాడ్యమిని పురస్కరించుకుని మహిళలు ఆదివారం తెల్లవారు సమయాన దీపోత్సవం నిర్వహించారు. కార్తీక మాసం అంతా పూజలు చేసిన మహిళలు పోలిపాడ్యమి రోజున నీటిలో దీపాలు వదలి కార్తీక దామోదరుడిని కొలిస్తే శుభం జరుగుతుందనే నమ్మకంతో ఇలా దీపోత్సవం నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతంలోని కొలనులు, చెరువులు వద్దకు మహిళలు భారీఎత్తున తరలి వచ్చి వాటిలో దీపాలు  వదిలారు. అరటి తెప్పలపై దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలారు.  దీంతో ఆయా ప్రాంతాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ప్రధానంగా తుంగ్లాం చెరువు, ఫీలానగర్‌ గెడ్డ  ప్రాంతానికి మహిళలు ఎక్కువ తరలివచ్చి దీపాలు విడిచారు. ఇంకొందరు అప్పికొండ, యారాడ బీచ్‌లకు వెళ్లి సముద్రంలో దీపాలు విడిచిపెట్టారు. 

Advertisement
Advertisement