జై ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-05-29T05:46:28+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నం దమూరి తారక రామారావు జయంతిని జిల్లావ్యాప్తంగా శనివా రం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుగపురుషుడు, ప్రజల మనిషి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో, ఏడు రోడ్ల జంక్షన్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణ పూలమాల వేసి నివా ళులర్పించారు.

జై ఎన్టీఆర్‌
పాతపట్నం : అంతరాబరోడ్‌ కూడలిలో ఎన్టీఆర్‌ భారీ కటౌట్‌ ఏర్పాటు చేసి.. కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ శ్రేణులు

 ఘనంగా మహానేత జయంతి 

నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/పాతపట్నం, మే 28)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నం దమూరి తారక రామారావు జయంతిని జిల్లావ్యాప్తంగా శనివా రం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుగపురుషుడు, ప్రజల మనిషి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో, ఏడు రోడ్ల జంక్షన్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణ పూలమాల వేసి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల్లో ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తీసుకువచ్చిన మహానేత ఎన్టీఆర్‌ అని కొనియాడారు. కిలో బియ్యం రూ.2కు, మహిళలకు ఆస్తిహక్కు, జనతావస్త్రాలు వంటి ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని ప్రజారంజక పాలనను అందించారని చెప్పారు. ఎన్టీఆర్‌ ఆశయాలను చంద్రబాబునాయుడు నెరవేరుస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అలాగే పాతపట్నంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను శనివా రం ఆ పార్టీ కేడర్‌ ఘనంగా నిర్వహించింది. అంతరాబ రోడ్‌ కూడలిలో ఎన్టీఆర్‌ 15 అడుగుల కటౌట్‌ ఏర్పాటు చేసి కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్వీ రమణమాదిగ, జిల్లా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు బరాటం ఉదయ్‌శంకర్‌ గుప్తా, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కనకల నారాయణ, రేగేటి రమణ,  నట్టుపాడి ప్రశాంతకుమార్‌ పాడి, గోకవలస అశోక్‌ చిన్న, బుజ్జి, ఆర్ట్స్‌ శేషు తదితరులు పాల్గొన్నారు.

‘మహానాడు’తో టీడీపీ నేతల్లో జోష్‌

  మహానాడుతో జిల్లా టీడీపీ నాయకుల్లో జోష్‌ పెరిగింది. కార్యకర్తల్లోనూ నూతనోత్సాహం కనిపిస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, జాతీయప్రధాన కార్యదర్శి లోకేష్‌లతో జిల్లా టీడీపీ నేతలు ప్రత్యేక సమావేశమై.. పార్టీ పరిస్థితిని వివరించారు. రానున్నది టీడీపీ ప్రభు త్వమని.. 160 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తెలుగుతమ్ముళ్లలో మరింత ఉత్సాహం, ఆత్మస్థైర్యం నింపింది. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మహానాడు సందర్భంగా చేసిన ప్రసంగం ఆకట్టు కుంది. ప్రభుత్వంపై విమర్శలతోపాటు.. టీడీపీ కేడర్‌లో జోష్‌ నింపేలా చేసిన ప్రసం గం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. జిల్లా టీడీపీ నాయకుడు కూన రవి కుమార్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు, గౌతు శిరీష, మాజీఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, శ్రీకాకుళం మండలం నాయకులు గొండు జగపతి, సర్పంచ్‌ శంకర్‌ తదితరులు చంద్రబాబునాయుడుని కలిశారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణతో అచ్చెన్నాయుడు కాసేపు ముచ్చటించారు.  

Updated Date - 2022-05-29T05:46:28+05:30 IST