ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-01-24T04:47:13+05:30 IST

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సుభాష్‌రోడ్డులోగల ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు, హిందూవాహిని నాయకులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.

ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు
లింగంపేట కళాశాలలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న డీఐఈవో షేక్‌ సలాం

కామారెడ్డి టౌన్‌, జనవరి 23: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సుభాష్‌రోడ్డులోగల ఆయన  విగ్రహానికి బీజేపీ నాయకులు, హిందూవాహిని నాయకులు  పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో గాంధీజీ లాంటి నాయకులు అహింసనే ఆయుధంగా చేసుకొని పోరాటం చేశారని అన్నారు. కానీ సుభాష్‌ చంద్రబోస్‌ లాంటి నాయకులు యువకులను ప్రోత్సహిస్తూ ఆంగ్లేయుల దౌర్జన్యాన్ని అడ్డుకుంటు స్వాతంత్ర భారతదేశానికై పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్య వర్గ సభ్యుడు చిన్నరాజులు, జిల్లా కోశాధికారి ముక్క సురేష్‌, బీజేపీ పట్టణ అధ్యక్షుడు భానుప్రకాష్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కడెం శ్రీకాంత్‌, నాయకులు దువ్వాల రమేష్‌, స్వామి, చైతన్య, హిందువాహని నాయకులు సాయికిరణ్‌, రాజు, అమర్‌నాఽథ్‌, సాయిప్రణయ్‌ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లిలో..
మాచారెడ్డి: మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. పరాక్రమ దివస్‌గా జరుపుకొని ఆయన చేసిన దేశ సేవలను కొనియాడారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. విద్యార్థులు నేతాజీ చిత్ర పటాన్ని గీసి వారి సత్తా చాటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ప్రశాంతి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్‌లో..

సదాశివనగర్‌: నేతాజీ పోరాట పటిమ గొప్పదని పద్మాజివాడి యువజన సంఘం ప్రతినిధులు అన్నారు. శనివారం ఆయన జయంతిని పురస్కరించు కుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర కాలం నాటి పోరాటపటిమను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమ ంలో యువజన సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ని అడ్లూర్‌ ఎల్లారెడ్డి పాఠశాలను డీఈవో రాజు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న 9, 10 తరగతుల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులు సుధాకర్‌కు తెలిపారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి: పట్టణంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి శనివారం పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఆంగ్లేయులపై బుల్లెట్‌గా దూసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ అని అన్నారు. ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్య క్షుడు సతీష్‌, రాజేష్‌, బాలకిషన్‌, ఓంకార్‌, శ్రీనివాస్‌, నరేష్‌, సాయి తదిత రులు పాల్గొన్నారు.
భిక్కనూరులో..
భిక్కనూరు: మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో నేతాజీ సుభాష్‌ చంద్రబోష్‌ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని నేతాజీ విగ్రహానికి ప్రజాప్రతినిఽధులు, గ్రామ పంచాయ తీ సిబ్బంది, ఉపాధ్యాయులు, యువజన సంఘాల సభ్యులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేతాజీ నిజమైన హీరో అని, నేతాజీని నేటియువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మ, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ హన్మంత్‌రెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఆయా పార్టీల నాయకులు, యువజన, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
లింగంపేటలో..
లింగంపేట: లింగంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. యువత సుభాష్‌ చంద్రబోస్‌ను స్ఫూర్తిగా తీసు కుని దేశం కోసం కృషి చేయాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి షేక్‌సలాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మోహన్‌ రెడ్డి, లెక్చరర్లు ఉన్నారు.
సంగెంలో..
నస్రుల్లాబాద్‌ : మండలంలోని సంగెం గ్రామంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భ ంగా సునీల్‌ రాథోడ్‌ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ధీరుడు నేతాజీ అని కొనియాడారు. సుభాష్‌ చంద్రబోస్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు తదిత రులు పాల్గొన్నారు.
బాన్సువాడ పట్టణంలో..
బాన్సువాడ టౌన్‌: పట్టణంలో స్వచ్ఛభారత్‌ బృందం, బీజేపీ నాయకులు , బీసీ విద్యార్థి సంఘం, తపస్‌ సంఘం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. సంగమేశ్వర కాలనీ చౌరస్తా వద్ద గల నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మీరు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రం ఇస్తానని బోస్‌ అన్నమాటలను గుర్తు చేసుకున్నారు. ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి జైహింద్‌ అనే నినాదంతో బ్రిటీష్‌ దొరల నుంచి భారత మాత దాస్య శృంఖలాలను తెంచడానికి ప్రయత్నించిన గొప్ప మహనీయుడన్నారు. జననమే తప్ప మరణం ఎరుగని మహావీరుడు సుభాష్‌ చంద్రబోస్‌ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్సపల్లి సాయిరెడ్డి, శ్రీనివాస్‌, చిదరి సాయిలు, శంకర్‌గౌడ్‌, లక్ష్మీనారాయణ, ప్రవీణ్‌గౌడ్‌, విజయ్‌, రాఘవ, అరవింద్‌, సునీల్‌, మోచి గణేష్‌, డాకయ్య, బూనేకర్‌ సంతోష్‌, జంగిలి రాజు, రాఘవేందర్‌, సాయిబాబా తదితరులున్నారు.
పిట్లంలో..

పిట్లం: మండల కేంద్రంలో శనివారం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయం తిని నిర్వహించారు. నేతాజీ చౌరస్తా వద్ద సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడా రు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రాము, టౌన్‌ ప్రెసిడెంట్‌ వడ్ల శివ, అశోక్‌రాజ్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-01-24T04:47:13+05:30 IST