ఎలమంచిలిలో పప్పల చలపతిరావుకు కేక్ తినిపిస్తున్న ప్రగడ నాగేశ్వరరావు
ఎలమంచిలి, జనవరి 23 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఎల మంచిలిలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, నాయకులు, కార్యకర్తలతో ఆంజనేయ ఆలయంలో పూజలు నిర్వహించారు. లోకేశ్ పేరిట స్వామికి 101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ప్రగడ నాగేశ్వరరావు, చలపతిరావు కేక్ కట్ చేసి, పేదలు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లె నానాజీ, నాయకులు రంగనాయకులు, దాడి ముసిలినాయుడు, కొఠారు సాంబ, ఆడారి ఆదిమూర్తి, ఆర్.ఎస్.నాగేశ్వరరావు, అనూరాధ, ఇత్తంశెట్టి రాజు, దొడ్డి శ్రీను, దిన్‌బాబు, మేరుగు బాపునాయుడు, రాజాన వెంకునాయు డు, బొద్దపు నాగేశ్వరావు, సుబ్బయ్యనాయుడు, కరణం రవి తదితరులు పాల్గొన్నారు.