ఘనంగా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు

ABN , First Publish Date - 2022-01-24T04:58:56+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్‌లు కట్‌ చేసి పంచిపెట్టారు.

ఘనంగా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు
కోటబొమ్మాళి : కేక్‌ తినిపిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు


 (ఆంధ్రజ్యోతి బృందం) 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్‌లు కట్‌ చేసి పంచిపెట్టారు. వివిధ దేవాలయాల్లో ఆయన పేరున అర్చనలు చేశారు. కోటబొమ్మాళిలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కేక్‌ కట్‌ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 

  

Updated Date - 2022-01-24T04:58:56+05:30 IST