వైభవంగా కృష్ణాష్టమి

ABN , First Publish Date - 2022-08-20T05:06:40+05:30 IST

: స్మార్త కృష్ణాష్టమి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేక అర్చనలు నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో సందడి చేశారు.

వైభవంగా కృష్ణాష్టమి
ఉట్టి వేడుకలను ప్రారంభిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

 కరీంనగర్‌ కల్చరల్‌, ఆగస్టు 19: స్మార్త కృష్ణాష్టమి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేక అర్చనలు నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో సందడి చేశారు. 

 

అఖిలభారత యాదవమహాసభ ఆధ్వర్యంలో ఉజ్వల పార్క్‌ వద్ద గల యాదవ భవనంలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గిద్దెపెరుమాళ్ళ అలయం వద్ద ఉట్టి వేడుకను జరిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ హాజరై ఉట్టి వేడుకలు, అన్నదానం ప్రారంభిం చారు. సాయంత్రం కోలాట నృత్యాలు, డోలు విన్యాసాల మధ్య కమాన్‌ వరకు, తిరిగి ఆలయం వరకు రథయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్‌ సునీల్‌రావు,  కార్పొరేటర్లు, యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు రాజన్న, నగర కార్యదర్శి గట్టయ్య, అంజన్న, బుచ్చన్న, రాజేందర్‌, ప్రసాద్‌, పరశురాములు, కొమురయ్య, సాయి పాల్గొన్నారు.

  సాయినగర్‌ మురళీకృష్ణ మందిరంలో సుందర సత్సంగ్‌ ఆధ్వర్యంలో కృష్ణుడికి విశేష పూజలు నిర్వహించారు. మంగళంపల్లి శ్రీనివాసశర్మ వైదిక నిర్వహణలో వేడుకలను గోపూజతో అడిషనల్‌ కలెక్టర్‌ జీవి శ్యాంప్రసాద్‌లాల్‌ ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు కృష్ణుడు, రాధ, గోపికల వేషాలు ధరింపజేసి హాజరయ్యారు. సాయంత్రం శోభాయాత్రను సుడా చైర్మన్‌ జీవి రామకృష్ణారావు ప్రారంభించారు. కార్యక్రమంలో బొడ్ల కృష్ణ, సుగుణాకర్‌, సురేందర్‌రావు, వసంతం, రమేశ్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.


అశోక్‌నగర్‌ శ్రీమళయాళ సద్గురు గీతామందిరంలో మఠాధిపతి విష్ణుసేవానందగిరి స్వామి ఆధ్వర్యంలో అభిషేక అర్చనలు, అలంకారం, సామూహిక సహస్రనామార్చన, హవనం జరిగాయి. సాయంత్రం భజనలు, ప్రవచనాలు, శోభాయాత్ర, 108 రకాల నైవేద్యాలు, డోలోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో గుండ రాధాకిషన్‌, రాజు, రమేశ్‌, శంకర్‌, బి సత్యం, లక్ష్మినారాయణ, శివలింగం, అర్చకులు విష్ణుమూర్తి, సోమేశ్వరశర్మ పాల్గొన్నారు.









Updated Date - 2022-08-20T05:06:40+05:30 IST