ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2020-08-12T10:12:05+05:30 IST

తాండూర్‌ మం డలంలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలు నిరాడంబ రంగా జరిగాయి. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధా రణలతో

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఆకట్టుకొన్న చిన్నారుల వేషధారణ

పలు చోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమం


తాండూర్‌(బెల్లంపల్లి), ఆగస్టు 11 : తాండూర్‌ మం డలంలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలు నిరాడంబ రంగా జరిగాయి. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధా రణలతో అలరించారు.  


కోటపల్లి: షెట్‌పల్లి ఆంజనేయస్వామి ఆలయంలో  కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. వేద పండితు లు అభిషేకాలు నిర్వహించారు. కృష్ణునిలీలలు, తాత్వికచింతనలను చదివి వినిపించారు. 


బెల్లంపల్లిటౌన్‌: బెల్లంపల్లి పట్టణం, పలు గ్రామా ల్లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. కన్నా లబస్తీ కోదండ రామాలయం, తదితర ఆలయాల్లో భక్తజన సందోహం కనిపించలేదు. కరోనా నేపథ్యంలో బోసిపో యాయి. కాలనీల్లో చిన్నారులకు గోపికా, గొల్లభామ, కృష్ణుని వేషధారణ చేశారు.


శ్రీరాంపూర్‌: కృష్ణాకాలనీ గీతా ప్రశాంతి నిల యం లో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని అర్ధచాతుర్మా స్య వత్రాన్ని నిర్వహించారు. కృష్ణునికి పంచామృతాభి షేకం,  సామూహిక లక్షపు ష్పార్చన నిర్వహించారు. దాసరి భక్త రాజేశం గురూజీ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.  రాజమౌళి, కె. లక్ష్మీనారా యణ, డిడి. ప్రసాద్‌, రాజయ్య పాల్గొన్నారు. 


వేమనపల్లి : మండలంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. తల్లిదండ్రులు పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలంకరించారు.  ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. 


జైపూర్‌: వేళాల గట్టు మల్లన్న దేవాలయంలో శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. శ్రీకృష్ణుని కి అభిషేకాలు, పంచామృతాలు, విశేష పూజలు, గీతా పారాయణం, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈవో రమేష్‌, సర్పంచ్‌ శ్యామల, ఉపసర్పంచ్‌ నగేష్‌,  లక్ష్మణ్‌, బాపు, సాయి పాల్గొన్నారు. 


చెన్నూర్‌: ప్రజలు శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. చిన్నారులు వేషధారణ తో ఆకట్టుకున్నారు. ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 


మందమర్రిరూరల్‌: చిర్రకుంటలో కృష్ణాష్టమి వేడు కలు ఘనంగా జరిగాయి. కృష్ణుని భజన పాటలతో ఊరేగింపు నిర్వహించారు. గోపాలకాలువలు వేడుకలు, కోలాటాలతో శ్రీకృష్ణున్ని కొలిచారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచు కొమురయ్య, ప్రజలు పాల్గొన్నారు. 


ఏసీసీ: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ సరస్వతీ శిశుమందిర్‌, విశ్వహిందూ పరిషత్‌ భజరంగ్‌దళ్‌ ఆధ్వ ర్యంలో వేడుకలు నిర్వహించారు. శ్రీకృష్ణుడిని ఆదర్శం గా తీసుకొని ధర్మరక్షణ, లోక రక్షణ కోసం విశ్వహిం దూ పరిషత్‌ పనిచేయాలనే ఉద్దేశ్యంతో కృష్ణాష్ఠమి రోజున స్థాపించడం జరిగిందన్నారు. వేవూరి రాములు గౌడ్‌ పాల్గొన్నారు. వీహెచ్‌పీ జిల్లా సహాయ కార్యదర్శి గా బోయిన రవికుమార్‌, నగర భజరంగ్‌ దళ్‌ సహ సంయోజక్‌గా ముస్కు శ్రీనివాస్‌ రెడ్డి, నగర సత్సంగ్‌ ప్రముఖ్‌గా నాగరాజు, నస్పూర్‌ నగర వీహెచ్‌ పీ ఉపా ధ్యక్షులుగా మనోజ్‌కుమార్‌, నగర సహాయ కార్యదర్శిగా దాసరి కిరణ్‌, మంచిర్యాల నగర ధర్మ ప్రసాద ప్రము ఖ్‌గా గట్టయ్యలను నియమించారు. 


కన్నెపల్లి : శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరి గాయి. చిన్నారులు శ్రీకృష్ణు డు, గోపిక వేష ధారణలతో అలరించారు. ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు.  


మందమర్రిటౌన్‌: మందమర్రి పట్టణంలో శ్రీకృ ష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాత బస్టాండ్‌ అంగడిబజార్‌ శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. మారుతినగ ర్‌లో చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో అలరించారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్ర మాన్ని నిర్వహించారు.  


హాజీపూర్‌: దొనబండలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుక లను నిర్వహిం చారు. గ్రామ ప్రజలు ఉట్టికొట్టే కార్యక్ర మంలో పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించారు.

Updated Date - 2020-08-12T10:12:05+05:30 IST