Abn logo
Jun 21 2021 @ 00:29AM

ఘనంగా జానారెడ్డి, ఉత్తమ్‌ జన్మదిన వేడుకలు

మిర్యాలగూడలో మాస్కులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

మిర్యాలగూడ టౌన / తిరుమలగిరి(సాగర్‌) / నిడమనూరు / నాగార్జునసాగర్‌ / హాలియా /  గుర్రంపోడు, జూన 20 : జిల్లావ్యాప్తంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా పార్టీ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్‌ భవనలో కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాఽధ్యమని అన్నారు. అనంతరం ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.  పార్టీ పెద్దల పుట్టిన రోజు సందర్భంగా మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బీఎల్‌ఆర్‌ ఫెయిత బంజారా తదితర అశ్రమాల్లో అన్నదానం నిర్వహించి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. తిరుమలగిరి(సాగర్‌) మండలంలో యూత కాంగ్రెస్‌ అధ్యక్షుడు పగడాల నాగరాజు పోలీస్‌ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. నిడమనూరు మండలంలో జానా తనయుడు జయవీర్‌రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. నాగార్జునసాగర్‌ పైలాన కాలనీలో కాంగ్రెస్‌ నాయకులు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హాలియాలోని ఆస్పత్రి సిబ్బందికి కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గౌని రాజారమే్‌షయాదవ్‌, కుందూరు జయవీర్‌రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గుర్రంపోడు మండలంలో జానా, ఉత్తమ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.