ఘనంగా హనుమాన్‌ జయంతి

ABN , First Publish Date - 2022-05-26T04:07:43+05:30 IST

ఆసిఫాబాద్‌ పట్టణంలో బుధవారం హనుమాన్‌ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధ లతో ఘనంగా జరి పారు. పట్టణంలోని కేస్లాపూర్‌ అంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు శిరీష్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యే కపూజలు నిర్వహించారు.

ఘనంగా హనుమాన్‌ జయంతి
అన్నదానంలో పాల్గొన్న ఏఎస్పీ, జడ్పీటీసీలు

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 25: ఆసిఫాబాద్‌ పట్టణంలో బుధవారం హనుమాన్‌ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధ లతో ఘనంగా జరి పారు. పట్టణంలోని కేస్లాపూర్‌ అంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు శిరీష్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యే కపూజలు నిర్వహించారు. ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు ధర్మపురి వెంకటే శ్వర్లు, గుండా వెంకన్న, పిన్న వివేక్‌, డాక్టర్‌ రమేష్‌, డాక్టర్‌ మధు, సురేష్‌, రాజశేఖర్‌, ఉదయ్‌, వెంకటేశం, రాధాకృష్ణచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T04:07:43+05:30 IST