వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ

ABN , First Publish Date - 2020-09-18T06:01:55+05:30 IST

పట్టణంలో మహి ళలు గురువారం బతుకమ్మ ఆడారు. రంగురం గు ల పూలతో బతుకమ్మలను పేర్చారు

వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ

మంచిర్యాల, సెప్టెంబరు 17: పట్టణంలో మహి ళలు గురువారం బతుకమ్మ ఆడారు. రంగురం గు ల పూలతో బతుకమ్మలను పేర్చారు. నూతన వస్త్రా లు ధరించి ప్రధాన కూడళ్ళలో ఆటపాటలు నిర్వహించారు.  


దండేపల్లి: మండలంలో ఎంగిలి పువ్వుల బతుక మ్మ సంబురాలను ఆడపడుచులు ఘనంగా జరు పుకున్నారు. బతుకమ్మను పేర్చి రాత్రి సమయంలో ఎంగిలి పువ్వుల బతుకమ్మ ఆట ఆడారు.  అనంత రం బతుకమ్మలను నిమజ్ఞనం చేశారు. 


చెన్నూరు: చెన్నూరు పట్టణ, మండల మహిళ లు ఎంగిలిపూల బతుకమ్మను భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. అధికమాసం రావడంతో గురువారం ఎంగిలిపూల బతుకమ్మలను నిర్వహించుకుని అక్టో బర్‌ 16 నుంచి సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నట్లు మహిళలు పేర్కొన్నారు. 


బతుకమ్మ పూలకు భలే గిరాకీ 

మందమర్రిటౌన్‌: పట్టణంలోని మార్కెట్‌ సెంట ర్‌లో గురువారం బతుకమ్మ పూలకు గిరాకీ పెరిగిం ది. చుట్టు పక్కల గ్రామాల తంగేడు, బంతి, గుమ్మ డి, గునుగు పూలను మార్కెట్‌లో విక్రయించారు.  


బెల్లంపల్లి టౌన్‌ : ఎంగిలి పూల బతుకమ్మలో భాగంగా పట్టణంలోని కాంటా చౌరస్తా, కాల్‌టెక్స్‌, మేయిన్‌ బజార్‌, ఏఎంసీ చౌరస్తాలో పూలు, అలం కరణ సామగ్రి విక్రయించారు. కాంటా చౌరస్తా ప్రాంతం పూల అమ్మకాలతో సందడిగా మారింది.

Updated Date - 2020-09-18T06:01:55+05:30 IST