ఘనంగా దసరా వేడుకలు

ABN , First Publish Date - 2021-10-17T06:47:27+05:30 IST

దసరా పండుగను శుక్రవారం జి ల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దీంతో అమ్మవారి ఆలయాలన్నిం టిలో సందడి నెలకొంది.

ఘనంగా దసరా వేడుకలు
వెండికవచ చీరతో కొత్తూరు వాసవీ మాత

అనంతపురం టౌన్‌, అక్టోబరు 26 : దసరా పండుగను శుక్రవారం జి ల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దీంతో అమ్మవారి ఆలయాలన్నిం టిలో సందడి నెలకొంది. శరన్నవరాత్రుల్లో భాగంగా భక్తులకు రోజుకొక రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు విజయదశమి సందర్భంగా రాజరా జేశ్వరీ మాతగా అనుగ్రహించారు. కొత్తూరు, పాతూరు వాసవీ కన్యకాప రమేశ్వరి ఆలయాల్లో మూలవిరాట్లను వజ్రకవచ చీరతో అలంకరించారు. బెంగళూరు రోడ్డులోని శివకోటి ఆల యంలో శివకామేశ్వరికి అప్పాస్వామి చేతులమీదుగా అభిషేకాలు, చక్రస్నానం, అపరాజిత సర్వమంగళపూజ నిర్వహించారు. అలాగే శారదానగర్‌లోని శృంగేరి శారదా శంకరమఠం, మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం, ఐదో  రోడ్డు కనకదుర్గ భవాని, నల్లమల సుంకులమ్మహెచ్చెల్సీ కాలనీలోని నసనకోట మత్యాలమ్మ, రామచంద్రనగర్‌లోని షిర్డీసాయి ఆలయం, సాయినగర్‌ కనకదుర్గా భవాని, జీసస్‌నగర్‌ రేణుకా యల్లమ్మ తదితర ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు చేశారు. ఉదయం నుంచి సా యంత్రం వరకూ భక్తులతో ఆలయాలు సందడిగా కనిపించాయి.

నయనమనోహరం వాసవీమాత శయనోత్సవం

 జిల్లాకేంద్రంలోని పాతూరు, కొత్తూరు అమ్మవా రిశాలల్లో ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం సాయంత్రం శయనోత్సవంతో ముగిశాయి. ఆయా ఆలయా ల్లో సాయంత్రం ప్రత్యేకంగా అ లంకరించిన ఊయలలపై అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి శయనోత్సవం నిర్వహించా రు. భక్తులు విశేషంగా హాజరై వాసవీ మాతను దర్శించు కున్నారు. కార్యక్రమంలో పా తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పార్శం సత్యనారాయణశెట్టి, ప్రధాన కార్యదర్శి చిందనూరు శ్రీనివాసులు, తిరువీధుల జగదీష్‌కుమార్‌, కొత్తూ రు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపామచ్చా నరసింహులు, ప్రధాన కార్యదర్శి మిట్టా ఆంజనేయలు, కొత్తూరు, పాతూరు యువజనసంఘాలు, వాసవీ మహిళా మండలుల ప్రతినిధులు, కార్యవర్గసభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

శింగనమల/రామగిరి : దసరా పండుగ సందర్భంగా శుక్రవారం శింగ నమల దుర్గాంజనేయస్వామి దేవాలయంలో శ్రీ దుర్గమ్మ, మెయిన బజా రు నగరేశ్వరస్వామి దేవాలయంలో దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. రామగిరి: మండలంలో విజయదశమి పండుగను భక్తి శ్రద్ధలతో శుక్రవారం జరుపుకున్నారు. నసనకోట దుర్గమ్మ, ముత్యాలంపల్లిలో ముత్యాలమ్మ, రామగిరి గంగమ్మ, కుం టిమద్ది కొల్లాపురమ్మ ఆలయాలు, పేరూరు శివాలయం, సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాల్లో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆయా ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. 


Updated Date - 2021-10-17T06:47:27+05:30 IST