Abn logo
Mar 7 2021 @ 23:44PM

ఘనంగా దంత వైద్యుల దినోత్సవం

కడప(సెవెన్‌రోడ్స్‌), మార్చి 7: నగరంలోని ఐఎంఏ ఫంక్షన్‌ హాలులో డెంటల్‌ సర్జన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా దంత వైద్యుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దంత వైద్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. కాగా కరోనా సమయంలో ఉత్తమ సేవలందించిన దంత వైద్యులకు ఘనంగా మెమెంటో, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, సెక్రటరీ డాక్టర్‌ షేక్‌ సంఘం నజీముద్దీన్‌, ట్రెజరర్‌ డాక్టర్‌ చిన్ని సంపత్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement