అంబరం... ఎదురుసేవ సంబరం

ABN , First Publish Date - 2022-01-17T06:59:02+05:30 IST

జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడికి వైభవంగా ఎదురుసేవ ఉత్సవాన్ని నిర్వహించారు.

అంబరం... ఎదురుసేవ సంబరం
స్వామి, అమ్మవార్లకు పూజలు

శ్రీకాళహస్తి, జనవరి 16: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడికి ఆదివారం సాయంత్రం వైభవంగా ఎదురుసేవ ఉత్సవాన్ని నిర్వహించారు. త్వరలో జరిగే ముక్కంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్ల కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ ఉత్సవం ముగిసిన వెంటనే ఉత్సవమూర్తులను పట్టణ సమీపంలోని శుకబ్రహ్మాశ్రమం వద్ద ఉన్న ఎదురుసేవ మండపంలో కొలువుదీర్చారు. ఈ సందర్భంగా కోనేరు జలాలతో స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, ఆలయానికి తరలించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T06:59:02+05:30 IST