ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ABN , First Publish Date - 2021-11-27T04:51:38+05:30 IST

రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, వివిధ శాఖల అధికారులు

- అంబేడ్కర్‌కు నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు

గద్వాల టౌన్‌/ గద్వాల క్రైం/ ఉండవల్లి/ ఎర్రవల్లి చౌరస్తా/ కేటీదొడ్డి/ మానవపాడు/ గట్టు, నవంబరు 26 : రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్లు రఘురామ్‌శర్మ, శ్రీహర్ష, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రాధాన్యం, విలువలు, లక్ష్యాలను కాపాడు తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీపీఆర్వో చెన్నమ్మ, పంచాయ తీరాజ్‌ ఈఈ సమత, ఏవో ఎల్లయ్య, ఎమ్మార్వో రాజు, మదన్‌మోహన్‌, వేణు గోపాల్‌రెడ్డి, తేజ, షఫీ తదితరులు పాల్గొన్నారు. 


రాజ్యాంగం పవిత్ర గ్రంథం

రాజ్యంగం దేశ ప్రజలందరికీ పవిత్ర గ్రంథమని మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ అన్నారు. 72వ రాజ్యాంగ దినోత్స వాన్ని పురస్కరించుకుని శుక్ర వారం పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో డాక్ట ర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగ నిబంధన లకు లోబడి పాలనలో భాగస్వామలవుతామంటూ చైర్మన్‌, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ బాబర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ జానకిరామ్‌ సాగర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


పరిరక్షణ అందరి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్సీమోర్చా ఆధ్వర్యంలో గద్వాలలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డంకృష్ణారెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జీఎల్‌ చందు, నాయకులు రామాంజ నేయులు, బండల వెంకట్రాములు, వెంకటేశ్వరరెడ్డి, రవి ఎగ్బేటే, భాస్కర్‌ యాదవ్‌, మాల శ్రీనివాస్‌, చిత్తారి కిరణ్‌, నరసింహ, నాగేందర్‌ యాదవ్‌, రామాంజి, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి, జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, జయశ్రీ, అనిత తదితరులు పాల్గొన్నారు. 


- గద్వాల పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగంపై ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్‌ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాణం, విధులు, విలువల గురించి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీ శ్రీపతినాయుడు వివరించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాసులు, డాక్టర్‌ ఎంపీ షఫిక్‌ అహ్మద్‌, నరేష్‌బాబు, రాణి, విజయలక్ష్మి పాల్గొన్నారు. 


రాజ్యంగ ఫలాలు అందరికీ అందాలి

రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని జడ్పీ సీఈవో విజయానాయక్‌ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉండవల్లి ఎంపీడీ వో కార్యాలయంలో జడ్పీ సీఈవో విజయా నాయక్‌ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజ్యాం గాన్ని గౌరవిస్తామని ప్రమాణం చేయించారు. కేపీపీఎస్‌, స్వేరోస్‌ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిం చిన కార్యక్రమంలో ఎస్‌ఐ జగన్‌మోహన్‌ పాల్గొని అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పిం చారు. పాఠశాలలో ఎంఈవో శివప్రసాద్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

- రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా శుక్రవారం ఉండవల్లి మండల కేంద్రంలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహనికి బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు బీసన్న, రంజిత్‌, సుంకన్న, బాబు, గిరిధర్‌ పాల్గొన్నారు.


- కేటీదొడ్డిలో అంబేడ్కర్‌ చిత్రపటానికి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు వీరేష్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మహా నందిరెడ్డి, అశోక్‌, శ్రీనివాసులు, తిరుపతి, నరసింహులు, జంగిల ప్ప, నరసింహ, వీరేష్‌, జనార్దన్‌ పాల్గొన్నారు.


- మానవపాడు మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి దళితమోర్చా నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో దళిత మోర్చా మండల అధ్యక్షుడు కాశపోగు సురేష్‌ నాయకులు విజయ్‌, శేఖర్‌, మురళి, లాలూ పాల్గొన్నారు.


- గట్టు మండలంలోని బల్గెరలో అంబేడ్కర్‌ చిత్రపటానికి బీజేపీ మండల అధ్యక్షుడు బల్గెర శివారెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ముక్కేరన్న, ఏలియా, బోర్‌వెల్‌ కృష్ణ, నవీన్‌, నర్సింహులు, సునంద పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T04:51:38+05:30 IST