ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-04-21T06:00:31+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
కోదాడలో కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు

హుజూర్‌నగర్‌/ కోదాడ/గరిడేపల్లి, ఏప్రిల్‌ 20: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నలమాద శ్రీనివాస్‌యాదవ్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా సహదేవరావు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తండు సాయిరామ్‌గౌడ్‌, బెల్లంకొండ రామజోగి, ఎలక వెంకటేశ్వర్లు, గార్లపాటి శ్రీనివాస్‌నాయుడు, చిన్నసైదా, రాము, ఇట్టిమళ్ళ జ్యోతి శ్రీనివాస్‌, వంశీ, సోమయ్య, వెంకన్న, మధు పాల్గొన్నారు. పట్టణంలోని ఇందిర సెంటర్‌లో తెలుగుయువత నాయకుడు మండవ వెంకటేశ్వర్లుగౌడ్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కోదాడలో జరిగిన చంద్రబాబు జన్మదిన వేడు కల్లో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉప్పగండ్ల శ్రీనివాసు, ఓరుగంటి ప్రభాకర్‌, నంబూరి సూర్యం, కొల్లు వెంకటేశ్వరరావు, ఉన్నం హనుమంతరావు, పిడతల శ్రీనివాసరావు, మైకు నాగులు, కొత్తా రాంబాబు, కోదాటి గురవయ్య, గౌని శ్రీనివాసు, ఎస్‌కే బడేసాహెబ్‌, బాబా పాల్గొన్నారు. గరిడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షకార్యదర్శులు కీసరి నాగయ్య, పాతకోటి లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ నకిరేకం టి సైదులు, భాస్కర్‌, శ్రీనివాసరెడ్డి, మైసయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T06:00:31+05:30 IST