Abn logo
Sep 27 2021 @ 00:51AM

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ

- తెలంగాణ వీర వనిత ఐలమ్మ స్ఫూర్తి ప్రదాత 

- కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణ 

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు 26: తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిప్రదాత, వారి జీవితం ఆదర్శనీయమని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ తెలి పారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆదివా రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆమె చిత్ర పటానికి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి కలెక్టర్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ వీరవనిత వరంగల్‌ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగో సంతానంగా చాకలి ఐలమ్మ సెప్టెంబర్‌ 26న జన్మించిందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, స్థాని క సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, ఇన్‌చార్చి బీసీ వెల్ఫేర్‌ అధికారి వినోద్‌కుమార్‌, డీఈవో మాధవి, కలెక్టరేట్‌ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.