ఘనంగా అన్నమయ్య జయంత్యుత్సవాలు

ABN , First Publish Date - 2022-05-17T06:01:09+05:30 IST

గాజువాక వుడా కాలనీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అన్నమయ్య జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా అన్నమయ్య జయంత్యుత్సవాలు
అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తున్న భక్తులు

గాజువాక, మే 16: గాజువాక వుడా కాలనీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అన్నమయ్య జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సప్తగిరి సంకీర్తన, కోలాటం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-17T06:01:09+05:30 IST