ఘనంగా అల్విదా జుమ్మా

ABN , First Publish Date - 2021-05-08T05:13:27+05:30 IST

రంజాన్‌ మాసంలో చివరి శుక్రవారం పలు మసీదుల్లో ముస్లింలు కరోనా జాగ్రత్తలు, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అల్విదాజుమ్మా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఘనంగా అల్విదా జుమ్మా
ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు


కరీంనగర్‌ కల్చరల్‌, మే7: రంజాన్‌ మాసంలో చివరి శుక్రవారం పలు మసీదుల్లో ముస్లింలు కరోనా జాగ్రత్తలు, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అల్విదాజుమ్మా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్‌ కూడా రాబోయే శుక్రవారం అని భావిస్తుండటంతో మరింత సందడి నెల కొంది. పవిత్ర ఖురాన్‌ పఠనం కొనసాగింది. రాత్రంతా ఇళ్లలో ప్రార్థన లు జరిగాయి. పేదలకు నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణీ చేసి జకాత్‌ ఫిత్రా దానాలు చేశారు. మరోవైపు కొందరు వస్తువులు, బట్ట లు కొనుగోలు చేశారు. నగరంలోని జాఫ్రి, మదీనా, మహముదీయా, అస్లామి, జామే, అమేర్‌షుజా మసీద్‌లతో పాటు పలు మసీద్‌ల్లో ముస్లింలు ప్రవచనాల్లో ప్రార్థనల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T05:13:27+05:30 IST