ప్రపంచ మార్కెట్లకు ‘ఫెడ్‌’ దెబ్బ

ABN , First Publish Date - 2022-05-15T07:55:17+05:30 IST

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ‘ఫెడరల్‌ రిజర్వ్‌’ వడ్డీ రేట్ల పెంపు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను బెంబేలెత్తిస్తోంది.

ప్రపంచ మార్కెట్లకు  ‘ఫెడ్‌’ దెబ్బ

రెండు వారాల్లో రూ.1,705 లక్షల కోట్లు హాంఫట్‌

100 లక్షల కోట్ల డాలర్ల దిగువకు మార్కెట్‌ సంపద


వాషింగ్టన్‌: అమెరికా కేంద్ర బ్యాంక్‌ ‘ఫెడరల్‌ రిజర్వ్‌’ వడ్డీ రేట్ల పెంపు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను బెంబేలెత్తిస్తోంది. ఫెడ్‌ ఒక్కసారిగా వడ్డీ రేట్లు అర శాతం పెంచింది. దీంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల.. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఈ నెల 12 నాటికి 99.13 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. 2020 డిసెంబరు తర్వాత ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల మార్కెట్‌ క్యాప్‌ 100 లక్షల కోట్ల డాలర్ల దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. గత కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు 22 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.1,705 లక్షల కోట్లు) మార్కెట్‌ క్యాప్‌ నష్టపోయాయి. ఇదే సమయంలో భారత స్టాక్‌ మార్కెట్‌.. మార్కెట్‌ క్యాప్‌ కూడా 3.03 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరింది. దీంతో ఈ ఏడాది మార్చిలో మార్కె ట్‌ క్యాప్‌ పరంగా ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్న భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రస్తుతం ఏడో స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది జనవరి ప్రారంభంతో పోల్చినా బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 12.4 శాతం మేర నష్టపోయింది.

Updated Date - 2022-05-15T07:55:17+05:30 IST