శతాబ్దిలోనే దారుణ తిరోగమనం

ABN , First Publish Date - 2020-06-11T08:08:10+05:30 IST

కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక శతాబ్ది కాలంలో కనివిని ఎరుగని తిరోగమనంలో పడిందని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) తెలిపింది. రెండో సారి వైరస్‌ విజృంభణ లేకుండానే ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడిందంటూ అది కూడా వచ్చినట్టయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని...

శతాబ్దిలోనే దారుణ తిరోగమనం

  • ప్రపంచ వృద్ధి మైనస్‌ 7.6 శాతం : ఓఈసీడీ


ముంబై : కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక శతాబ్ది కాలంలో కనివిని ఎరుగని తిరోగమనంలో పడిందని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) తెలిపింది. రెండో సారి వైరస్‌ విజృంభణ లేకుండానే ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడిందంటూ అది కూడా వచ్చినట్టయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించింది. వైరస్‌ ప్రభావం వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని, ప్రధానంగా టూరిజం, విమానయాన రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. తమ సంఘం ఏర్పాటైన తర్వాత ప్రపంచ వృద్ధిపై ఈ తరహా నివేదిక ఇవ్వడం ఇదే ప్రథమమని ఓఈసీడీ సెక్రటరీ జనరల్‌ ఏంజెల్‌ గురియా అన్నారు. రెండో విడత వైరస్‌ విజృంభణ లేకపోతే మాత్రం ఈ ఏడాది ప్రపంచ వృద్ధిరేటులో క్షీణత మైనస్‌ 6 శాతం మేరకు ఉండవచ్చునని ఆయన అన్నారు. రెండో విడత విజృంభణ కూడా ఏర్పడితే క్షీణత 7.6 శాతం వరకు ఉండవచ్చునని ఆయన చెప్పారు. 


13వ ఏడాదీ అంతే : ఎస్‌ అండ్‌ పీ

స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ సంస్థ భారత దీర్ఘకాలిక పరపతి రేటింగ్‌ను బీబీబీ మైన్‌సగా యథాతథంగా కొనసాగించింది. భారతదేశానికి ఈ రేటింగ్‌ ప్రకటించడం వరుసగా ఇది 16వ సంవత్సరం. వాస్తవ జీడీపీ వృద్ధి సగటు కన్నా పైనే ఉండడం, విదేశీ నిల్వల పరిస్థితి కూడా సానుకూలంగా ఉండడం, ద్రవ్యపరమైన చర్యల కారణంగా ఈ ఏడాది రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించినట్టు తెలియచేసింది. అయితే 2021 నుంచి రికవరీ ప్రారంభమవుతుందని కూడా తెలిపింది.

Updated Date - 2020-06-11T08:08:10+05:30 IST