ప్రపంచవ్యాప్తంగా కోటి 80 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-03T20:35:53+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా

ప్రపంచవ్యాప్తంగా కోటి 80 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూయార్క్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య సోమవారం ఉదయానికి కోటి 80 లక్షలు దాటింది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 6,87,930గా ఉంది. ఇక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కోటి 6 లక్షల 49 వేల 108 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 46,65,932 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా అమెరికాలో 1,54,841 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో నిత్యం 60 నుంచి 70 వేల కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో నిత్యం రికార్డు స్థాయిలో కేసులు బయడపడుతున్నాయి. ఇక అమెరికా తరువాతి స్థానాల్లో బ్రెజిల్, ఇండియా, రష్యా, సౌత్ ఆఫ్రికా దేశాలున్నాయి. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 27 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా.. భారత్‌లో కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. ఇక రష్యాలో 8 లక్షలకు పైగా.. సౌత్ ఆఫ్రికాలో 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. అనేక దేశాల్లో ఇప్పటివకే వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-03T20:35:53+05:30 IST