Glenn Maxwell: భారత సంతతి యువతిని పెళ్లాడిన ఆసీస్ స్టార్ క్రికెటర్.. ఆర్‌సీబీ విషెస్!

ABN , First Publish Date - 2022-03-19T18:54:03+05:30 IST

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఓ ఇంటివాడయ్యాడు.

Glenn Maxwell: భారత సంతతి యువతిని పెళ్లాడిన ఆసీస్ స్టార్ క్రికెటర్.. ఆర్‌సీబీ విషెస్!

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఓ ఇంటివాడయ్యాడు. భారత సంతతి యువతి, తన ప్రియురాలు వినీ రామన్‌ను శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా వినీ, మాక్స్‌వెల్ దంపతులకు ఆర్‌సీబీ.. ట్విటర్ ద్వారా ప్రత్యేకంగా విషెస్ తెలియజేసింది. కాగా, కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2020 ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. 


కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చిన వీరి వివాహం శుక్రవారం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. భారత్‌లోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వినీ కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిర పడింది. ప్రస్తుతం ఆమె మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మాక్స్‌వెల్‌తో వినీకి ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా ప్రేమికులుగా మారిన ఈ జంట ఇప్పుడు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, ఇతర క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  



Updated Date - 2022-03-19T18:54:03+05:30 IST