కరోనా చికిత్సకు ఫాబిఫ్లూ 400 ఎంజీ

ABN , First Publish Date - 2020-08-07T01:26:23+05:30 IST

కరోనా చికిత్సలో ట్యాబ్లెట్ల వినియోగాన్ని తగ్గించేందుకు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ముందుడుగు వేసింది. దీనికోసం 400ఎంజీ ఫ్యాబీఫ్లూ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి...

కరోనా చికిత్సకు ఫాబిఫ్లూ 400 ఎంజీ

ముంబై: కరోనా చికిత్సలో ట్యాబ్లెట్ల వినియోగాన్ని తగ్గించేందుకు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ముందుడుగు వేసింది. దీనికోసం 400ఎంజీ ఫ్యాబీఫ్లూ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ నేడు తాము 400 ఎంజీ రూపంలో నోటి ద్వారా తీసుకునే ఫ్యాబీ ఫ్లూ మాత్రలను పరిచయం చేశామని వెల్లడించింది. తక్కువస్థాయి కోవిడ్‌-19 లక్షణాలు కలిగిన వారికి ఈ ట్యాబ్లెట్లను వినియోగిస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ల వల్ల బాధితుడు కోలుకోవడంతో పాటు రోజువారీగా వినియోగించాల్సిన ట్యాబ్లెట్ల సంఖ్య కూడా తగ్గుతోందని గ్లెన్‌మార్క్ వెల్లడించింది. ఇప్పటివరకు ఫాబీఫ్లూ 200ఎంజీ మోతాదులో రోగులు మొదటి రోజు 18 మాత్రలను(ఉదయం-9; రాత్రి-9) తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రతి రోజూ 8 మాత్రలను 14 రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నూతన 400ఎంజీ ట్యాబ్లెట్లతో మొదటి రోజు 9 మాత్రలు (ఉదయం-4లేదా5 ట్యాబ్లెట్లు; రాత్రి-4లేదా5 బిళ్లలు) తీసుకుంటే సరిపోతుంది. అలాగే 2వ రోజు నుంచి కోర్సు ముగిసే వరకూ రెండేసి ట్యాబ్లెటను రోజుకు రెండుసార్లు తీసుకోవడంతో డోసు ముగుస్తుంది.

Updated Date - 2020-08-07T01:26:23+05:30 IST