50 వేల మంది పోలీసులకు గ్లెన్‌మార్క్ సాయం

ABN , First Publish Date - 2020-06-05T00:05:55+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న పోలీస్ అధికారులకు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్‌ తమవంతు...

50 వేల మంది పోలీసులకు గ్లెన్‌మార్క్ సాయం

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న పోలీస్ అధికారులకు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్‌ తమవంతు సాయం అందిస్తోంది. స్వచ్ఛంద సంస్థ రైజ్ ఇన్ఫినిటీ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకున్న గ్లెన్‌మార్క్ ఫౌండేషన్ సీఆర్ఎస్ విభాగం పోలీసులకు క్యాండిడ్ డస్టింగ్ పౌడర్‌ను పంపిణీ చేసింది. దీనిద్వారా పోలీసులు చర్మసమస్యల బారిన పడకుండా ఉంటారని సంస్థ తెలిపింది. ఇప్పటివరకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో 50వేలకు పైగా పోలీసు అధికారులకు ఈ పోడర్‌ను సరఫరా చేశారు. ఈ కార్యక్రమం గురించి గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ జోషి మాట్లాడుతూ " క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ ఉండేలా చూడటంలో పోలీసులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటారు.


ఇప్పుడు వారి సేవలు ఆరోగ్య రంగానికి కూడా విస్తరించాయి. ఈ మహమ్మారి విస్తరిస్తున్న వేళ ముందుండి పోరాటం సాగించడంలో పోలీసు అధికారులు ఎండ, వాన తేడాలేకుండా అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడుకోవడం మనందరికీ ఎంతో అవసరం. అందుకు అనుగుణంగానే చర్మవ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మా సంస్థ ఈ పౌడర్‌ను వారికి అందిస్తోంది. వారి సేవకు మా వంతు సాయం చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-06-05T00:05:55+05:30 IST