కరోనా ఔషధం ధరలో 25 శాతానికిపైగా కోత!

ABN , First Publish Date - 2020-07-13T21:28:12+05:30 IST

కరోనా చికిత్సకు వినియోగిస్తున్న ఫెవిపిరావిర్ ఔషధం ధర 27 శాతం మేర తగ్గిస్తున్నట్టు ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్ ప్రకటించింది.

కరోనా ఔషధం ధరలో 25 శాతానికిపైగా కోత!

న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు వినియోగిస్తున్న ఫెవిపిరావిర్ ఔషధం ధరను 27 శాతం మేర తగ్గిస్తున్నట్టు ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్ ప్రకటించింది. దీంతో ఒక్కో ట్లాబెట్ ధర రూ. 103 నుంచి రూ. 75కు చేరింది. గ్లెన్‌మార్క్ సంస్థ అధికార వర్గాలకు ఈ మేరకు సమాచారం అందించింది. కరోనా లక్షణాల తీవ్రత తక్కువగా లేక మధ్యస్థాయిలో ఉన్నప్పుడు డాక్టర్లు ఈ ఔషధాన్ని సూచిస్తారన్న విషయం తెలిసిందే.


ఈ ఔషధం తయారీ భారత్‌లోనే చేపడుతున్నామని సంస్థ తెలిపింది. ఈ కారణంగా ధరలో వచ్చిన తగ్గుదలను వినియోగదారులకు బదీలి చేస్తున్నామని పేర్కొంది. తొలిసారి భారత్‌లో ఈ ఔషధాన్ని ప్రవేశ పెట్టిన సమయంలోనూ మీగతా దేశాల ధర  కంటే  ఇక్కడి ధర చాలా చౌక అని సంస్థ తెలిపింది. అయితే తాజాగా నిర్ణయంతో వినియోగదారులకు మరింత మేలు జరగుతుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 

Updated Date - 2020-07-13T21:28:12+05:30 IST