గ్లాండ్‌ ఫార్మా లాభంలో 34% వృద్ధి

ABN , First Publish Date - 2022-01-22T08:16:57+05:30 IST

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో గ్లాండ్‌ ఫార్మా కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.273 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

గ్లాండ్‌ ఫార్మా లాభంలో 34% వృద్ధి

హైదరాబాద్‌: డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో గ్లాండ్‌ ఫార్మా కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.273 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (రూ.204 కోట్లు)తో పోల్చితే లాభం 34 శాతం వృద్ధి చెందింది. వివిధ మార్కెట్లలో అమ్మకాలు గణనీయంగా పెరగటం ఎంతగానో కలిసివచ్చిందని కంపెనీ పేర్కొంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.859 కోట్ల నుంచి రూ.1,063 కోట్లకు పెరిగింది. 

Updated Date - 2022-01-22T08:16:57+05:30 IST