మూడేళ్లు పనిచేయడం సంతోషమిచ్చింది

ABN , First Publish Date - 2021-07-25T06:08:08+05:30 IST

కడప జిల్లా కలెక్టరుగా మూడేళ్లు పనిచేయడం తనకు సంతోషాన్నిచ్చిందని బదిలీపై వెళుతున్న కలెక్టరు సి.హరికిరణ్‌ శనివారం ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. ఈ మూడేళ్లలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, క్రీడలు, ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

మూడేళ్లు పనిచేయడం సంతోషమిచ్చింది

కలెక్టర్‌ హరికిరణ్‌

కడప, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా కలెక్టరుగా మూడేళ్లు పనిచేయడం తనకు సంతోషాన్నిచ్చిందని బదిలీపై వెళుతున్న కలెక్టరు సి.హరికిరణ్‌ శనివారం ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. ఈ మూడేళ్లలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, క్రీడలు, ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.  2018లో చాంపియన ఆఫ్‌ చేంజి అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి తీసుకోవడం సంతోషాన్నిచ్చిందన్నారు. 2019లో నీతిఅయోగ్‌ సమావేశం, న్యూఢిల్లీలో జలశక్తి అభియాన జాతీయ స్థాయి అవార్డు రావడం సంతోషాన్నిచ్చాయన్నారు. 2018 అక్టోబరులో గండికోటలో మొదటిసారి 12 టీఎంసీల నీటిని నిల్వ చేశామని, అదే సంవత్సరం నవంబరులో వైవీయూలో ఏపీ సైన్స కాంగ్రెస్‌ విజయవంతంగా నిర్వహించామన్నారు. జూనియర్‌ బ్యాడ్మింటన టోర్నమెంటు విజయవంతం చేశామన్నారు. 2019లో జరిగిన జనరల్‌ ఎలక్షన్స, 2021లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. గత ఏడాది డిసెంబరులో గండికోట ప్రాజెక్టులో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేశామన్నారు. ఇదే కాకుండా కడప విమానాశ్రయ సుందరీకరణ, 2019లో జరిగిన గండికోట ఉత్సవాలు, ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. జిల్లా పరిషత స్పెషల్‌ ఆఫీసరుగా, కడప మున్సిపల్‌ ప్రత్యేక అధికారిగా సైతం విధులు చేపట్టానన్నారు.


నేడు కలెక్టర్‌కు సన్మానం

జిల్లా నుంచి బదిలీ అయిన కలెక్టర్‌ సి.హరికిరణ్‌కు ఆదివారం కడప ప్రెస్‌క్లబ్‌లో ఏపీయూడబ్ల్యూజే అధ్వర్యంలో సన్మానం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఆ సంఘం అధ్యక్షకార్యదర్శులు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-07-25T06:08:08+05:30 IST