వేతనాలు ఇప్పించండి

ABN , First Publish Date - 2022-01-20T05:54:11+05:30 IST

నియోజకవర్గంలో పోలీసులకు సమాంతరంగా సేవలందిస్తున్న తమకు 10 నెలల బకాయి వేతనాలు ఇప్పించాలని కోరుతూ బుధవారం ఎస్‌పీవోలు ఎమ్మెల్యే సామినేని ఉదయభానును షేర్‌మహ్మద్‌పేటలో కలిసికోరారు.

వేతనాలు ఇప్పించండి
ఉదయభానును కలిసిన ఎస్‌పీవోలు

ఎమ్మెల్యే ఉదయభానుకు ఎస్‌పీవోల వినతి

జగ్గయ్యపేట రూరల్‌ : నియోజకవర్గంలో పోలీసులకు సమాంతరంగా సేవలందిస్తున్న తమకు 10 నెలల బకాయి వేతనాలు ఇప్పించాలని కోరుతూ బుధవారం ఎస్‌పీవోలు ఎమ్మెల్యే సామినేని ఉదయభానును షేర్‌మహ్మద్‌పేటలో కలిసికోరారు. వారు మాట్లాడుతూ, ఇప్పటికే పలుమార్లు పోలీస్‌, ప్రజా ప్రతినిధులు, ఎస్పీని కూడా కలిసి సమస్యను వివరించామని, అయినా ఇంతవరకు తమకు వేతనాలు రాలేదన్నారు. స్పందించిన ఉదయభాను సమస్యలను సీఎ్‌సతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 


Updated Date - 2022-01-20T05:54:11+05:30 IST