చైనా వస్తువులను బహిష్కరిస్తున్నాను: లడాఖ్ ఇంజనీర్

ABN , First Publish Date - 2020-05-30T21:45:50+05:30 IST

‘భారత్‌లో తమ వస్తువులను విక్రయించుకోవడం ద్వారా చైనా వేల కోట్లు ఆర్జిస్తోంది. కానీ ఆ మొత్తాన్ని...

చైనా వస్తువులను బహిష్కరిస్తున్నాను: లడాఖ్ ఇంజనీర్

శ్రీనగర్: ‘భారత్‌లో తమ వస్తువులను విక్రయించుకోవడం ద్వారా చైనా వేల కోట్లు ఆర్జిస్తోంది. కానీ ఆ మొత్తాన్ని సైన్యానికి మళ్లించి భారత్‌పైనే కాలుదువ్వుతోంది. అందుకే చైనా వస్తువులను బహిష్కరించండి’ అంటూ లడాఖ్‌లోని సోనం వాంగ్‌చుక్ ఇంజనీర్ పేర్కొన్నారు. తాను తన చైనా ఫోన్‌ను వాడడం మానేస్తున్నానని, ఇకపై చైనా మొబైల్ ఫోన్‌లో చైనా అప్లికేషన్లను కూడా వినియోగించేది లేదని వాంగ్‌చుక్ తెలిపారు. ‘చైనా వస్తువులు ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. వాటిని అంత త్వరగా వదులుకోలేరు. అందువల్ల ఒక వారంలో చైనా సాఫ్ట్‌వేర్లు, అప్లికేషన్లను వినియోగించడం వదిలి పెట్టండి.


ఆ తరువాత చైనా మొబైల్స్, గాడ్జెట్స్, ఇతర వస్తువులను ఏడాదిలోగా వినియోగించడం మానేయండి. అంతే చైనాకు మనం బుద్ధి చెప్పినవాళ్లం అవుతాం’ అని వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఇంజనీరింగ్ చదివిన సోనం వాంగ్‌చుక్ ఆ తరువాత విద్యలో మార్పుల కోసం పోరాడుతున్నారు. ఆయన స్ఫూర్తితోనే విధు వినోద్ చోప్రా అమీర్ ఖాన్ హీరోగా ‘త్రీ ఇడియట్స్’ సినిమా తీశారు.

Updated Date - 2020-05-30T21:45:50+05:30 IST