బందరులో డీఎంహెచ్వో సుహాసినికి వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగులు
మచిలీపట్నం టౌన్, జనవరి 28 : పాత జీతాలే ఇప్పించాలని డీఎంహెచ్వో డాక్టర్ సుహాసినికి శుక్రవారం కార్యాలయ ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, అయితే సర్వీసు రిజిష్టర్లలో పే ఫిక్సేషన్లు చేయకుండా ఎలా కొత్త జీతాలు వేస్తారని ఉద్యోగులు ప్రశ్నించారు. అకౌంట్ సెక్షన్ ఉద్యోగులు ఎస్ఆర్ల్లో ఫిక్సేషన్లు నమోదు చేయకుండా కొత్త పీఆర్సీలో జీతాలు వేయవద్దని తెలిపారు.
ఘంటసాల : పాత పద్ధతిలోనే జీతాలు ఇప్పించాలని ఎంపీడీవో కె.వెంకట సుబ్బారావుకు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు వినతిపత్రాన్ని అందజేశారు. పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు వేముల సురేష్, వేమూరి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ముదినేపల్లి : పీఆర్సీ అమలులో ఉపాధ్యాయులకు అన్యాయం జరుగకుండా చూడాలని ఫ్యాప్టో ముదినేపల్లి మండల నాయకులు శుక్రవారం ఎంఈవో నరేష్కుమార్కు వినతిపత్రం అందజేశారు. తమ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్న కొత్త పీఆర్సీ వద్దు, పాత జీతాలే కావాలని ఫ్యాప్టో నాయకులు గొట్టిపాటి రమేష్, బే తాళ రాజేంద్ర ప్రసాద్, హరిబాబు, అనగాని వీరమల్లేశ్వరరావు, పీఆర్సీ సాధన సమితి నాయకులు కోరారు.